పుట:KutunbaniyantranaPaddathulu.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 126

వేసక్టమీ చేయించుకున్న తరువాత....

వేసక్టమీ చేయించుకున్న వారికి వీర్యకణాలు పైకి పయనించడానికి అవకాశం లేక టెస్టికల్స్ దగ్గరలోనే ఆగి పోతాయి తరువాత అక్కడే నశించిపొతాయి. ఇలా కొంతకాలం జరిగేసరికి వృషణాలలో వీర్యకణాల్ని ఉత్పత్తి చేసే టిస్యూలు వాటిని చాలవరకు తగ్గించివేస్తాయి. ఒక ప్రక్క వృషణాలనుండి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటే రెండవప్రక్క వృషణాల నుండి పురుష సెక్స్ హార్మోనుల ఉత్పత్తి ఎక్కువవుతూ ఉంటుంది. అందుకని వేసెక్టమీ చేయించుకున్న వారిలో కామపరంగా సామర్ధ్యము, కోరికలు పెరుగుతాయే తప్ప తగ్గడం జరగదు. వేసక్టమీ చేయించుకున్న తరువాత ఎవరిలోనైనా కామసామర్ధ్యం సన్నగిల్లిందని అంటే అది కేవలం వారిలో ఉన్న భయాందోళనలు వల్లనే కాని వాస్తవంగా కామసామర్ధ్యం తగ్గడం కాదు.

టెస్టోస్టిరోన్ ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ?

వేసక్టమీ చేయించుకున్న వాళ్ళలో లైడింగ్ స్వెల్స్ ఎక్కువ అవడానికిగాను, టేస్టోస్టిరోన్ ఉత్పత్తి పెరగడానికి గాని దోహదంచేసే స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ లేదు. అయినా వేసెక్టమీ చేయించుకున్న వాళ్ళలో వీర్య కణాలని ఉత్పత్తిచేసే టిస్యూలే కారణమని భావించడం