పుట:KutunbaniyantranaPaddathulu.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 125

వాళ్ళాల్లో పురుష సెక్స్ హార్మోను ని ఉత్పత్తి చేసే లైడింగ్ సెల్స్ ని కరక్టుగా లెక్కకట్టడం చేశారు. ఆ పద్ధతి అవలంబిచగా వేసక్టమీ చేయించుకున్న పురుషులలో ఆపరేషన్ చేయించుకున్న రెండుసంవత్సరాలలో లైడింగ్ సెల్స్ మరింత పెంపొందాయి, వాటి సంఖ్య పెరగడంతోపాటు టెస్టోస్టిరోన్ ఉత్పత్తికూడా ఆపరేషన్ చేయించుకున్న ముందుకంటె ఎంతో ఎక్కువ పెరిగింది. ఈ రకంగా వేసెక్టమీ చేయించుకోవడానికి ముందు-తరువాత కొన్ని సంవత్సరాలపాటు ఆఫరేషన్ చేయించుకున్నవారి హార్మోనుని అంచనాకట్టి టెస్టోస్టిరోన్ ఉత్పత్తి పెరుగుతుందేతప్ప తగ్గదని నిర్ధారణచేసి చూపించారు. ఈ రకంగా అనేకమందిని పరీక్షచేసి పెద్ద శాస్త్రవేత్తలు తమ ప్రయోగ ఫలితాల గురించి ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రికలైన బ్రిటీష సర్జరీ జర్నల్ లోను, అమెరికన్ సర్జరీ జర్నల్ లోనూ, లాన్ సెట్ లోను, ఇంటర్నేషనల్ సర్జరీ జర్నల్ లోనూ, ఇంకా ఇతర జర్నల్స్‌లోను పరిశోధనల వ్యాసాలను ప్రకటించారు. కొత్తపధతి ద్వారా ఈ విధంగా వేసక్టమీ చేయించుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే టెస్టొస్టిరోన్ గురించి, లైడింగ సెల్స్ గురించి అంచనా కట్టడంలో మన భారతీయ శాస్త్రవేత్తలే విజయం సాధించారు.