పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

బాధలు కలిగినందున వారు బ్రహ్మయొద్దకుబోయి ఈయాపదను తొలగింపుమని వేదుకొనిరి. అంత బ్రహ్మదండనీతిని పెద్దగ్రంధముగా రచించి, దానిని శంకరునకు నేర్పెను. శంకరు డింద్రునకిచ్చెను. అతడు దానిని బృహస్పతికిచ్చెను. బృహస్పతి దాని క్లుప్తపరచి 3000 అధ్యాయములుకలగిదాజేసెను. దీనికి బృహస్పతినీతియని పేరు. శుక్రుడు దానినింకను సంగ్రహిపరచి 1000 అధ్యాయములలో నిమిడ్చెను. ప్రజాపతి యాశాస్త్రమును అనంగున కిచ్చెను. ఈ యనంగుడు తద్గ్రంధానుసారము ప్రపంచమును పాలించిన మొదటి రాజు. అతనిసుతుడు అతిబాలుడగువాడు తండ్రిమార్గము ననుసరించెను; కాని వానికుమారుడగు వేనుడు ధర్మాతిక్రమణము తో భూపరిపాలన మొనర్చి స్వేచ్చావర్తనుడయ్యను. కనుక ఋషులాతనివధించి అతని కుడితొడనుండి పృధువనువానిని సృజించిరి. పిమ్మట బ్రాహ్మణులును దేవతలును అతనితో నిట్లనిరి. "ఈభూమిని ధర్మశాస్త్రానుసారము నిష్పాక్షికముగా సమదృష్టితో బాలింపుము. బ్రాహ్మణుల శిక్షింపననియు వర్ణసాంకర్య్హమును ఆపెదననియు వాగ్దత్తముచేయును"పృధునట్లెవాగ్దత్తముచేసి తదనుసారము న్యాయముగా నేల యేలెను. బ్రాహ్మణులును దేవతలును స్వవచనా నుసారము అతనికి శ్రేష్టవస్తువుల నిచ్చిరి. అతడు భూమిమీద రాలను తీసివేయించి యదిపదునేను విధములగు గడ్దిని, మనుష్యలకును యక్షులకును ఇతరులకును కావలసియున్న వృక్షవర్గమును ఇచ్చునట్లుచేసెను. ప్రజారంజకుడగుటచేత అతడు "రాజు"