పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి భూగోళశాస్త్ర జ్ఞానము

క్షాత్రయుగారంభమున హింద్వార్యులకు భూగోళశాస్త్ర జ్ఞాన, మెంతయుండునో యూహించుట కష్టము కాని తద్యుగాంతము నాటికి వారికి హొందూదేశమునుగుఱించియు చుట్టుప్రక్కల నున్న దేశములనుగురించియు బాగుగా దెలిసియుండేనని చెప్పవచ్చును. ప్రపంచభూగోళమును గుఱించి వారికి వివరములంతగా దెలిసియుండలేదు. ఆప్రకారము తెలియనిచోట్లయందెల్ల వారు ఊహతో పనిగొనిరని తెలిసియున్నది. వీరికావ్యములందు వచ్చి యున్న వర్ణనలనుబట్టి వారి "ప్రపంచము" ఎట్టిదిగానుండేనో చూతము.

    మహాభారతానుసారము:-ప్రపంచము అనేక ద్వీపములు గా భాగింపబడియున్నది. మనముందు భూభాగమునకు "జంబూద్వీపము" అనగా జంబూవృక్షముకల ద్వీపము అని పేరు. ఈద్వీపము లనేక చ్వర్షములుగా విభజింపబడి యున్నది. *(పటము జూడుడు) భూమికి ఉత్తరౌ సరిహద్దున క్షీరసముద్రమున్నది. దక్షిణపు హద్దున లవణసముద్రము కలదు. పూర్వ పశ్చిమ

  • ఈవర్షములో కొన్ని నిజమైనవిగను కొన్ని యూహాజనితములుగను దొచుచున్నవి.