పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రేయుగమునాటి హింద్వార్యులు.

లందును సముద్రములున్నవి. *భూమధ్యప్రదేశమున మేరు పర్వత మున్నది. దీనికి దక్షిణమున మూడు పర్వతపంక్తులు పూర్వ పశ్చిమదిశలవ్యాపించియున్నచ్వి. వీనివేళ్ళు నిషధపర్వతము (ఆల్టాయ్); హేమకూటము (కారాకోరము) హిమాలయము; హిమాలయమునకు దక్షిణమున భారతవర్షమునూదేయక్షాంశమునున్న ఇతరదేశములును కలవు. వీని కుత్తరమున హైమవతవర్షమున్నది. నిషధపర్వమున కుత్తరమున ఇలావృతవర్షము కలదు, మేరువు, చిన్ననగు మఱి రెండు పర్వతములు (మాల్యవంతము గంధమాధవము, అనునవి) ఈభూభాగమును నాల్గు చిన్నభాగములుగా జేయుచున్నవి. ఈ నాల్గుభాగములలోనొకటి జంబూద్వీపము. ఈద్వీపమునకీపేరు అతివిశాలమగు నొక జంబూవృక్షమునుండి యుత్పత్తియై ఉత్తరకురు దేశమువైపు ప్రవహించిన జంబూనదినిబట్టి వచ్చినది. తక్కినమూడింటిలో పశ్చిమదిశనున్న రెండు దేశములకు 'భద్రాశ్వము, ' కేతుమాల, యని పేళ్లు. పైనవచ్చిన హైవవతవర్షమునందు ఇప్పటి జపాను, మంచూరియా, మంగోలియా, ఉత్తరతుర్కిస్థానము, జర్మనీ, ఇంగ్లాండు చేరి యుండవలెనని యనేకుల యభిప్రాయము ఇక మేరువు అనునది ఉత్తరధృవసమీపమున నుండెనని యూహించినచో ఇలావృత్తవర్షమున ఇప్పటి రష్యా, స్వీడను, నార్వేలు ఒకవైపునను ఉత్తరామెరికా ఇంకొకవైపునను చేరియుండెనని చెప్పవచ్చును ఇచ్చటిభూమి బంగారపుదని మనవారు చెప్పియున్నారు. ఉత్తర కనడాలోని యెకభాగమున బంగరుదొరకుచున్నమాట


  • ఈససముద్రముల పేర్లు మాత్రము కానరావు.