పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రతయై మానవసేవజేయుట కామె క్రైస్తవమతస్థురాలగుటయే కారణముగ దలంచితిని. ఇందువలన నాహృదయమునందు క్రైస్తవమతాభిమానము గాఢమగుచుండెను. ఇదిగాక మాకు మిషన్‌పాఠశాలలో నుపాధ్యాయులుగా నుండిన ప్రభల రామచంద్రయ్య బి. ఏ. గారు దక్షిణాదినుంచి వచ్చిన బ్రాహ్మణుడు, కొలది సంవత్సరములకు మునుపే భార్యసమేతముగ క్రైస్తవ మతములో కలసెను. గుంటూరులో తహశీలుదారుగా నుండిన చేవెండ్ర వెంకటచలముపంతులుగారును క్రైస్తవమతమును స్వీకరించిరి. కనుక నేనుమాత్రము క్రైస్తవుడ నేల కాగూడ దను ప్రశ్న నన్ను బాధించగా చివరకు క్రైస్తవమతములో చేరవలెనని నిశ్చయించుకొని శ్రీరామచంద్రయ్యగారియొద్దకు పోయి, నాకోరికను తెలిపితిని. కాని నన్ను ప్రోతహింపక "బాగుగ ఆలోచించుకొని చేరవలెను. ఇంతలో తొందరపడనేల" అని వాక్రుచ్చిరి. మరియొక క్రైస్తవపెద్దమనుష్యునియొద్దకు గూడ పోయి వారితో ముచ్చటించితిని. ఆయనయైనను ప్రోత్సాహము చేయలేదు. నాకుమాత్రము ఉత్సాహము తగ్గలేదు. గాన క్రైస్తవ మతములో కలియవలెనని దృడనిశ్చయముచేసుకొని యూలుదొరగారియింటికి పోతిని. యూలుదొరసాని వారిబంగళావెలుపల వరండాలో ఆసీనయైయుండెను. ఆమెతో నాకోర్కె తెలుపుటతోడనే మిక్కిలి సంతోషముతో లేచి నా జంధ్యము తీసివేయమని నాతో చెప్పుచు లోపల గదిలో ఎదియో వ్రాసుకొనుచున్న యూలుదొరగారియొద్దకు పరుగెత్తుకొనిపోయి నేను క్రైస్తవమతమును స్వీకరించుటకు వచ్చితినని పరమోత్సాహముతో చెప్పెను. ఆయన వెలుపలకు వచ్చి, నన్ను ప్రశ్నిం