పుట:Kavijeevithamulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

నందితిమ్మన.

187

వీరు దక్షిణామూర్తిదేవతోపాసనవలనఁ గల్గినవిశేషమహిమ వచోధోరణి గలవారలై యున్నారు. వీరలచేఁ జేయంబడిన యీక్రిందిపద్యమువలన నీమూర్తియెడ వీరికిఁ గలభక్తితాత్పర్యములు స్పష్టము కాఁగలవు.

ప్రబోధచంద్రోదయములోని దక్షిణామూర్తి వర్ణనము.

"సీ. ఎఱుఁగనివారికి నేదేవుఁడు ప్రపంచ, మవు మరీచికలు నీ రైనకరణి
    ఎఱిఁగినవారికి నేదేవుఁడు జగంబు, గాఁడు పగ్గము పాము గానికరణి
    ఏదేవుఁడు వెలుంగు నాదిశక్తియుఁ దాను, నెలయును నిండు వెన్నెలయుఁబోలె
    బ్రహ్మనాడ్యాగతప్రత్యక్పరంజ్యోతి, నా మించు నేదేవు నడిమి నేత్ర

గీ. మట్టిసర్వేశుతోడఁ దాదాత్మ్యమహిమ, గలిగి పరిపూర్ణ భావవిఖ్యాతు లైన,
   దక్షిణామూర్తిదేశికోత్తము నఘోర, శివుల భజియించి యేకాగ్రచిత్తమునను.

నందిమల్లన్న ఘంటమలయమారుతకవుల కాలనిర్ణయము.

పేర్కొనఁబడిన కవు లిర్వురును పైనిజెప్పిన తిమ్మకవికి సంబంధులని చెప్పితిమి. దానిం దెల్పుట కొకపద్యము పైకశ్వరులచే వారిర్వురవలన నాంధ్రీకరింపఁబడిన ప్రబోధచంద్రోదయ మనుగ్రంథములో వివరింపబడెను గావున దానింబట్టి చూడగా నది యీ క్రిందివిధమున స్పష్టమగును.