Jump to content

పుట:Kavijeevithamulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కవి జీవితములు

ఈపద్యములఁబట్టి చూడఁగా ముక్కుతిమ్మనకు మల్లయకవి సవతితమ్ముం డనియును, సింగనకవి సవతిమేనల్లుం డనియును దేలినది. ఈసింగనకవికి మలయమారుతాభిధాన ముండుటంబట్టి యితఁడు తిమ్మకవికి మేనమామ యగుమలయమారుతకవికిఁ గుమారుని కుమారుఁడు గా నూహింపనై యున్నది.

ఈగ్రంథమునందును నాస్వాసాంతగద్యములో "ఇది శ్రీమదు మామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది అని చెప్పి యుండెను.

ఈకవులకు రాజయోగశాస్త్రమునందును. విశేషపరిశ్రమ గలదని చెప్పుట కీక్రిందిపద్యమే చాలి యున్నది. ఎట్లంటేని :-

చ. జలకము మూర్ధచంద్రసుధ షట్కమలంబులపూజ ధూపము
   జ్జ్వలతరబోధ వాసన-నివాళు సుషుమ్న వెలుంగు శౌర్యముల్
   తలఁపున నీగి బోనము సదాతననాదముఖంబు గాఁగ ని
   ష్కలుషతనీయనంతవిభుగంగన గొల్చు నిజాత్మలింగముల్.

ఈ కవులకవిత్వవిశేషమును శయ్యాచమత్కృతియునుం జూపుటకుఁ గృతిపతిని వర్ణించి చెప్పిన మఱియొకపద్య మీక్రింద వ్రాయు చున్నాను :-

"సీ. సరిలేనినీతిచాతురిచేత రాజ్యతం,త్రంబులు నడిపిన నడుపుఁ గాని
    అనిశము పుష్పచందనవనితాదిసౌ,ఖ్యంబులు నందిన నందుఁ గాని
    సమహితశక్తిని సదవవాసదను శా, సనలీల జరిపిన జరుపుఁ గాని
    సంగీతసాహిత్యసరసవిద్యావినోందంబులఁ దగిలినఁ దగులుఁ గాని

గీ. నీళ్లలోపలిసరసిజ నీదళంబు, సరణి నిర్లేపుఁ డైనసంసారయోగి.
   సందియము లేదు ప్రత్యక్ష శంభుమూర్తి, యీయనంతయగంగమంత్రీశ్వరుండు.

ఈ కవు లిర్వురును ముక్కుతిమ్మకవితమ్ముం డనియు మేనల్లుండనియునుం జెప్పుటం జేసి వీ రాతనిసమకాలీనులే యగుదురు లేకున్న ముప్పదినలువదిసంవత్సరములు చిన్న వారలైన నై యుందురు. వీరలు కృష్ణరాయలసమకాలీను లని గాని లేక యతనియల్లుం డగురామరాయల సమకాలీను లని కాని నిర్ణ యింపఁబడవచ్చును.