పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కథలు - గాథలు

లోపలికి పోవడానికి ఇంకొదారి వున్నమాట నిజమేకాని అది నౌకర్ల కొసం ఏర్పడినదారి. ఈపాపిష్టి ముండాకొడుకు మొఖం కనబడకుండా అక్కడ ఈ చిత్రం చూస్తూ నిలబడిన వాళ్ల లేవిడీలు తప్పించుకోవడానికిన్నీ అలాగ సందులొనుంచి లోపలికి దూరడం వారికి చాలా పరువు తక్కువగా తోచింది. పోనీ ఒక పోలీసు వాడిని పిలిచి ఈ "న్యూసెన్సు" మాన్పిద్దా మనుకుంటే ఇతడేమి నేరం చేశాడని పిర్యాదు చేయగలరు? స్నాడ్ గ్రాసు తన చర్యలవల్ల ఎలాంటి నేరమూ చేయడం లేదు. మునిసిపాలిటీ నిబంధననలలో దేనినీ మీరడంలేదు. పైగా అతడు చేసెపని పరోపకారంగా కూడావున్నది. ముఖ్యంగ వర్షంకురిసి బురదగా వున్నరోజున మహోపకారంగానూ వున్నది. అదిగాక అతనిపట్ల ప్రజలందరికీ అమితమైన జాలి కలుగుతూ వున్నది.

ఈ కంపెనీ డైరక్టర్ల కోర్టువారికి హిందూదేశంపైన అమితమైన అధికారాలున్నాయి. అక్కడ తమ నిరంకుశాధి కారాలను చలాయించడంలో వీరు ఏమాత్రమూ వెనుదీయరు; ఎంత క్రూరంగా నైనా ప్రవర్తిస్తారు; కాని తమ కార్యాలయం గుమ్మం ఎదుటనే తమ కింద పూర్వం పనిచేసిన తాబేదారు డొకడు తమ అధికారాన్ని ధిక్కరించి నవ్వుబాటు చేస్తువుంటే వీరు దీని కే ప్రక్రియనూ చేయలేక పోతున్నారు. ఇదిచూచి ఇతరులుకూడా ఇలాంటి పెంకితనాలు మొదలు పెడతారేమో! అందువల్ల డైరక్టర్ల కోర్టువారు మొదట కోపంతో మండి పడినా వీధిలో ఈ అప్రతిష్ట మాన్పుకోడానికి ఏదో మార్గం యోచించక తప్పినదికాదు. స్నాడ్ గ్రాసుతో రాజీ చేసుకొవడమే ఉత్తమ మార్గంగా కనబడింది. ముందుగా అతడు చేస్తూవున్న చర్య మానివేస్తే అతని వ్యవహారం మళ్లీ ఆలోచిస్తామని కంబురంపారు. తనతోపాటు ఉద్యోగం చేసినవారికి న్యాయంగా వచ్చే పించను మొత్తమునేే తన పని తొలిగించిన తేదీ లగాయతూ తనకు కూడా మంజూరు చేసేవరకూ తన చర్యను విరమించనని అతడు చాల మర్యదగా మళ్ళీ కబురంపాడు. డైరెక్టర్లున్నూ వారి చైర్మెనుగారున్నూ బింకాలు మానివేసి స్నాడ్ గ్రాసు కోరికలను చెల్లిస్తూ తీర్మానాలు చేశారు.