పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

కథలు - గాథలు

గ్రాసు ఈ సంగతి ఆ చిన్న దళాధిపతికి చెప్పాడు. అతడు ఏంచేస్తాడు? స్నాడ్ గ్రాసును చెన్నపట్నం తీసుకొని వెళ్లాడు.*[1]

ఇక బ్రౌనుదొర ఏం చేస్తున్నాడో చూద్దాము. ఎలాగైతేనేమి బ్రౌను ఎంతో తంటాలుపడి చాలాసంగతులు బయటికి లాగాడు. వీటిని బట్టి స్నాడ్ గ్రాసుపైని కేసు పెడదామని మద్రాసు గవర్నమెంటువారు ఆలోచించారు కాని ఇలాంటికేసు విచారింఛడానికి చెన్నపట్నం సుప్రీము కోర్టువారికి అధికారం వున్నదో లేదో అని అనుమానం కలిగినందువల్ల ఇది మానుకున్నారు. 1800 సంవత్సరం మొదలు 1804 వరకూ ఏమీ పనిలేకుండా స్నాడ్ గ్రాసును చెన్నపట్నంలోనే వుండమన్నారు. విలియం బెంటింక్ గవర్నరుగా ఉండగా ప్రభుత్వంవారు 1804 లో ఇతని పని తీసివేశారు. అంతట స్నాడ్ గ్రాసు తన డబ్బాడవాలీసర్దుకుని సామానులు తీసుకొని ఇంగ్లాండుకు ఓడ ఎక్కాడు. ఇతడు 27 సంవత్సరాలు కంపనీవారికొలువులో పనిచేసి జీతం కొద్దిపాటిదైనా పెద్దసంపద ఆర్జించాడు. ఇతడు తన సంపదతో పాటు ఇంగ్లాండుకు పరువు ప్రతిష్టలు కూడా తెచ్చుకోవడం వల్ల తూర్పుఇండియా కంపెనీ డైరెక్టర్లు తమ ఉద్యోగుల కెచ్చే పించను ఇతనికి యివ్వడానికి నిరాకరించారు. దీనికి ఉపాయ మేమిటని ఇతడు ఆలోచించాడు. తనహక్కు నిలబెట్టుకోవాలనీ కక్షసాధీంచాలని ఇతనికి బుద్ధి పుట్టింది. తనకు న్యాయం చేయకపోతే తమకూ కష్టం కలిగేటట్లు ప్రవర్తించవలసి వస్తుందని ముందుగా డైరెక్టర్లను ఇతడు హెచ్చరించాడు. ఈ బెదిరింపులకు వారు ఏమీ జవాబు చెప్పక ఉపేక్షించారు. కొన్నాళ్లు గడవనిచ్చి ఇతడు కార్యాచరణకు పూనుకున్నాడు. చిరిగిపోయిన పాతదుస్తులూ పాకీవాళ్లు వీధులూడిచే చీపురుకట్టా కొని, ఆ పాతదుస్తులు వేసుకొని చీపురుతో లీడెన్ హాలు వీధిలో తూర్పు ఇండియా కంపెనీవారి దివ్యభవనం ఎదుట నిలిచి రోడ్డు ఊడ్చడం ప్రారంభించాడు. తాను ఎవరో ఇతరులకు తెలియకుండా ప్రచ్చన్నంగాగాక, బహిరంగంగా వచ్చి పోయేవారితో కుంపినీవారికి ఇండియలో ఉన్న మంచి ధనవంతమైన రాష్ట్రంలో

  1. * (Glimpses of Hidden India - John Law 1909. pp.91-93)