పుట:Kasiyatracharitr020670mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

దేశస్థులకున్ను వుండే ఆచారాది భేఅములు గౌడద్రావిడాది బ్ర్రాహ్మణ జాతి విభజనలు, భూగోళ భగోళస్థితి క్రమములు మొదలైన యనేక విచిత్రసంగరులు బహు జనోపకారబుద్దితో వ్రాయబడి యున్న వాటిలో యీ కొన్ని విషయములను యీపుస్తకము అచ్చువేసి ప్రచురము చేయపూనుకొన్నందున నాబుద్ధి శక్తి స్వల్పమయినా విధిలేక యధా శక్తిగా వ్రాయడమైనది.

కోలలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళ. ---

రామజయం --

రాజేశ్రీ యేనుగుల వీరాస్వామి అయ్యవారలంగారు లోకోపకారబుద్ధితో యాత్రసంగరులను వ్రాయునప్పుడు ప్రస్తానములలో అనేకులకు సందేహాస్పదములైన విషయములను గురించి తమ సూక్ష్మమయిన బుద్ధిబలముచేత నిష్పక్షపాతముగా ప్రసంగింపుచు తమ తాత్పర్యములను బయిలుపరచి యున్నారుగనుక వాటిని చదివేవారు సులభముగా తెలుసుకునేకొరకు ఆ ప్రసంగములకు మొదటనున్ను తుదనున్ను పుష్పములు వుంచి మరిన్ని స్పష్టముగా తెలిశేకొరకయి ఆ ప్రసంగగ్రంధపంక్తులయొక్క మొదళ్ళనున్ను పుష్పములు వుంచియున్నవి. *అని అతిసులభముగా చరివేవారికి తెలియుటకై ఆ యా ప్రసంగములు వుండే పుటల లెక్కయున్ను ఆ యా ప్రసంగములయొక్క తాత్పర్య సంగ్రహములున్ను ఈ యడుగున వ్రాయబడుచున్నవి. ---


  • ఈపుష్పము గుఱుతు లీముద్రణమున వుంచలేదు.