పుట:Kasiyatracharitr020670mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీ ఠి క

ఇందువల్ల అతి వినయముతో తెలియపరచుటయేమంటే యేనుగల్ వీరాస్వామి అయ్యవారలంగారు కాశీయాత్ర బోవునప్పుడు యాత్ర సంగతులున్ను ఆయా ప్రదేశముల వినోద సంగతులున్ను వ్రాయించి పంపించవలెనని యడిగినందున వారు అలాగే అప్పుడప్పుడు వ్రాయించి పంపగా ఆ సంగతులను పుస్తకముగా చేర్చినాను. అది కరకరంబాటి తపాలా రైటరు-పనయారువేలకు మొదలారి అరవభాషతో తర్జుమాచేయించగా అచ్చు వేయించి ప్రసురము చేయబడియున్నది. అనేక గొప్పప్రభువులు తెనుగు భాషతో నావద్దనున్న యాపుస్తకము ప్రచురము చేయబడితే బహు జనోపయుక్తముగా నుండునని కోరినందున పైన చెప్పిన పుస్తకము కాశీయాత్రచరిత్ర యనే పేరుతో అచ్చుమూలకంగా ప్రచుర ప్రచడమైనది.

యిందులో యాత్రబోవువారికి వుపయోగించేలాగు మాగన్ ములు, మజిలీలు అచ్చట దొరికే వస్తువులున్ను వ్రాసియుండుట మాత్రమేగాక మార్గముల కిరుపక్కలనుండే అడువులు, కొండలు, పొలాలు, గుంటలు, తోపులు, వూళ్ళు మొదలైనవాటి వివరములున్ను మజిలీలొ నుండే స్థలవసతి, గృహవసతి, జలవసతులున్ను మజిలీల సమీప గ్రామముల సంగతులన్ను, తిరువళ్ళూరు, తిరుపతి, అహోబిలము, శ్రీశైలము, కాశి, గయ, జగన్నాధము, శ్రీకూర్మము, దాతావైద్యనాధము, సింహాచలము, కళ్ళేపల్లి, శ్రీకాకొళము మొదలైనదివ్యదేశముల మహిమలున్ను, గంగ, యమున, సరస్వతి, ప్రయాగ, గొదావరి, కృష్ణ, సరయు,శోణభద్ర, కర్మనాశిని, గండకి, ఫల్గుని, పున: పున: నది,సీతాగుండము, బ్రహ్మగుండము, పినాకిని మొదలైన నదుల మహిమలున్ను, హయిదరాబాదు, నాగపూరు, కటకం, కలకత్తా, రాజమహేమ్,ద్రవరం, పట్నా, గంజాం, విశాఖపట్ణం, విజయనగరం, మచిలీబందరు, నెల్లూరు, చెన్నపట్నం వగైరా షహరుల సంగరులున్ను, మరిన్ని ఆయా ప్రస్తావములలో అద్వైత ద్వైత విశిష్టాద్వైత మతములు, క్రీస్తు మహమ్మదు మతములు దక్షిణదేశస్థులకున్న, ఉత్తర