పుట:Kasiyatracharitr020670mbp.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువుచేస్తాడనే మాట సత్యం సత్యం పున:సత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలశినది.

నా జన్మభూమి అయిన చెన్నపట్టణపు వృత్తాంతము యెటువంటిదంటే 300 యేండ్ల కిందట చంద్రగిగిలో బీజానగరపు స్దంస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా డే అనే దొర యీ సముద్రతీరమునందు వొక రేవుబందరు కట్టించవలనని యత్నము చేసి శ్రీగంగరాయణ్ని అడిగి వుత్తరువు తీసుకుని యీ ప్రాంత్యాలకు జమీందారుడయిన దామర్ల వెంకటాద్రినాయుడి పేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృతపరిచయుడు గనుక శ్రీరంగరాయడు తన పేరుపెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవు బందరు కట్టమన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణ మని పేరుపెట్టి కట్టమని చెప్పడమేగాక తానే సన్నిధానాధిపతి గనుక అదే నామకరణము ఆరంభములో ఛేసినందున చెన్నపట్టణమని పేరు కలిగినది. తత్పూర్వము యీరేవును యింగిలీషువారు మదిరాసు అంటూ వచ్చినారు.

పిమ్మట 1644 యింగిలీషు సంవత్సరములో రేవు బందరుకు చేరినట్టుగా వొక కోటకట్టి చముద్రతీరము నందు రెండుకోసుల భూమిని యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. అటుపిమ్మట 1661 సంవత్సరములో యింగిలీషువారిలో కొంత అంత:కలహము జరిగి అరాజమమయి 1671 సంవత్సరములో మళ్ళీ స్థిరపడి యీ రేవు బందరు సుంకము యిజారా కుంఫిణీవారి చేసినారు. వంబడిగానే కుంఫిణీవారి ప్రాపకము కోరి జగదీశ్వరుడు సత్యవాదులపై పక్షపాతి గనుక యింగిలీషువారు చాలా సత్యసంధులయినందున యీ బస్తీలో మూడు లక్షల ప్రజ వాసముఛెశేటట్టు చేశినాడు. పిమ్మట 1666 సంవత్సరములో 40000 వరహాలు సాలుకు యెత్తేపాటి భూమి కుంఫిణీవారి యధీనమయినది. పిమ్మట 1702 సంవత్సరములో డిల్లీ పాదుషా అవరంగజీబు తరపున దావూతుఖానుడు దండుయెత్తివచ్చి యింగిలీషువారిని చాలా కలతపెట్టినాడు. అప్పట్లో అనేక తెగలు అనేక దేశములనుంచి యిక్కడికి చేరినందున యెడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి