పుట:Kasiyatracharitr020670mbp.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కక్షి*[1] అని రెండు పక్కలుగా యిక్కడివారు చీళి యింగిలీషువారికి చాలా శ్రమను కలగఛెసినారు. అందుకు 40 సంవత్సరముల తర్వాత ప్రాంసువారు యీకోట తీసుకొని యింగిలీషువారిని వెళ్ళకొట్తినా హిందూస్థాన్ లో యింగిలీషుజాతికి దిగ్విజయము కలిగి వుండెను గనుక వారు వొకపాటిగా సమాళించినారు. వెంబడిగానే 5 సంవత్సరములకు రాజీ

  1. * కుడియెడమల కులకక్షలు: వైష్ణవబ్రాహణులలోని వడగలి తెంగలి తెగలవలెనే ద్విజేతరకులములందు కుడి ఎడమ కులకక్షలు చాలాకాలమువరకు అతి తీవ్రముగా నుండేవి. కుడిచెయ్యి కలకక్షిలో లింగధారణముచేసిన నేతగాండ్రు, తెలికలవాండ్లు, కుట్రపుపనివాండ్రు, బలిజలు, గొఱ్ఱెల కాపరులు, కుమ్మరులు, మేదరులు, చాకళ్ళు, మంగళ్ళు, జోగులు, బుడబుక్కలవాండ్రు, మాలలు నుండిరి. ఈ కుడికులమువారిని కొన్నిచోట్ల చైనాచారులని న్ని, కొన్నిచోట్ల మహానాటివారనిన్ని వ్యవహరించిరి. ఎడమచెయ్యి కులములను పాంచాలలనిన్ని, మత్తుజనిన్ని వ్యహరించిరి. వీరిలో జందెములు వేసికొను అయిదు తెగల బత్తులు, వెండి బంగారు పనిచేయు కంసాలిబత్తులు, రాగి యిత్తడి పనిచేయు కంచరిబత్తులు, రాతి పనిచేయు శిల్పులు, రంగులువేయు హటగాదులు, నేతనేయు దెవాంగులును, గొల్లలు, మతరాచలు, మాదిగలు మొదలగువారుండేవారు. ఈ రెండు కక్షలలోని కులములవారు వొకరికన్న వొక రెక్కువ వారమనిన్ని తమకు ముందుగా మర్యాదలు జరుగవలెనన్ని తగవులాడుచుండేవారు. ఈ రెండు తెగలకు వేరువేరు మతాచారములుండెను. దేవతలు దేవుళ్ళు నుండిరి. వీరి వివాహములందు మరణములందు కొలువులందు జాతరలందు ఒక కులకక్షివారి వీధులనుండి రెండవకక్షి కులములవా రూగేంపులు చేయకూడదను కులకట్టులు నిషేధములు అనాదిసిద్ధముగా నుండి తగవులకు దెబ్బలాటలకు కారణ మగుచుండెను. పెండ్లిండ్లలో మహానాటివారిలో మాలలు గుఱ్ఱమునెక్కి యూరేగుటకు కొన్ని గ్రామములందభ్యంతర ముండెను. తక్కివారిలో ఆయా కులముల తారతమ్యములను బట్టి పల్లకీలు మొదలైనవి యెక్కి భజంత్రీలు మేళతాళములతో నూరేగినచో నెడమకులములవా రభ్యంతర పెట్టకుండిరి. ఇంకను చిత్రవిచిత్రములైన యాచారాలుండెను. ఇవి మీరినట్లయితే రెండవారు ఆటంక పరుచుచుండేవారు. చాలాకాలమువరకు నింగ్లీషు కుంఫినీప్రభుత్వము వారీ కులమర్యాదలను కాపాడుచునే యుండిరి. సివిలు క్రిమినలు కోర్టు లీ తగవులతో నిండుచుండేను. దేశము తెలుగు మీరిన తరువార రోడ్లు మొదలగు బహిరంగస్థలములలో నందరికిని సమానమైన హక్కులు కల సమ సిద్ధాంతము స్థాపింపబడినది. చెన్నపట్టణమున 1652, 170-7, 1718 సంవత్సరములం దిట్టితగవులువచ్చింట్లు కుంఫిణీ వారి రికార్డులలోనే వివరింపబడియున్నది. ఈ రెండుకులములవారికి పెద్దనాయకునిపేట ముత్యాలపేటలలో ప్రత్యేక వీధు లేర్పాటు చేయబడెను.