పుట:Kasiyatracharitr020670mbp.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది ఐదవ ప్రకరణము

సెప్టెంబరునెల 1 తేది ఉదయాత్పూరము నాలుగంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి 14 ఆమడలదూరములో వుండే పొన్నేరి యనే స్థలము 10 గంటలకు చేరినాను.*[1] దారి రేగడభూమి గనుకనున్ను వర్షాలునిండాగా యిప్పట్లో కురిశివున్నది గనుకనున్ను నడవడానకు నిండా ప్రయాసగా వుండినది. పొన్నేరి వూరిముందర అరణ్యనది రొమ్ములమట్టు నీళ్ళుండగా కాలినడకగా దాటినాము. పొన్నేరియనే వూరు రెండుభాగాలుగా విభజింపబడి వున్నది. ఆరెండు భాగాలున్ను కలియడానకు మధ్యే వొక విశాలమయిన అంగడివీధి సత్రాలు సహితముగా కట్టివున్నది. యీ వీధిలో ప్రతిసంవత్సరము హరిహరాదులు వారివారి వాహనారూఢులయి సంధించే వుత్సవము జరుగుచున్నది. గనుక ఏతద్విషయమయి యీ వీధిని బహుసుందరముగా యేర్పరచివున్నారు. దక్షిణభాగమందు వుండేవూళ్ళో ఆరుముఖ మొదలారి వొక శివాలయము తటాకము మొదలైన ధర్మస్థలములను నిర్మించివున్నాడు. ఉత్తరభాగమందు అనారి విష్ణుస్థలము తటాకము మొదలయిన దేవాలయ బ్రహ్మాలయాలు వున్నవి. 40 బ్రాహ్మణయిండ్లు కలవు. బట్టలు సహితముగా కావలసిన పదార్ధాలు అన్ని యీ వూళ్ళో దొరుకును. విశాలమయిన సత్రాలు చెన్నపట్టణపు వారు కొన్ని కట్టివున్నారు. విష్ణు స్థలమునకు భూరూపకమయిన జీవనము వుండేటందున కుంఫిణీవారు ధర్మకర్తను యేర్పరచి పనులు జరుపుకుంటారు. శివస్థలమునకు ఆరుముఖ మొదలారి వొక ముఠాను తీసి దాని ఆర్జితముగుండా అతి విమర్శగా నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు జిరిగింపుచున్నాడు.

ఈస్థల మహాత్మ్యము బ్రహ్మాండపురాణాంతర్భూతముగా 5 అధ్యాయాలువున్నవి. వాటిసారమేమంటే శ్రీకృష్ణమూర్తి ద్వాపరాంతమందు కలిలో తాను యీస్థలములో మూర్తీభవింఛేటట్టు ఋషులకు

  1. * ఇక్కడ యీదులనారాయణయ్యగారి దగ్గఱ బసచేసినా నని వ్రాతప్రతి 420 పుట.