పుట:Kasiyatracharitr020670mbp.pdf/400

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చెప్పివున్నందున ఈ రహస్యము భారద్వాజులు తెలుసుకుని యిదే బృందావనక్షేత్రమని నిశ్చయించి యిక్కడ స్వామిసాక్షాత్కారము పొందడమునకు బ్రహ్మను కూర్చి తపస్సుచేసినట్టున్ను బ్రహ్మభారద్వాజుల యిష్టసిద్ధి అయ్యేకొరకు విష్ణుప్రీత్యర్ధముగా నారాయణవనములో యాగము చేసినట్టున్ను అప్పుడు అరణి మధనలో ప్రధమము వొక నది పుట్టినంతలో ఆ అరణ్యనదిని భారద్వాజుల నిత్యకర్మాదులకు వొదిగేటట్టుగా యీ పొన్నేరికి పంపించినట్టున్ను పిమ్మట యాగానంతరము శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనంతలో భారద్వాజుల యిష్టసిద్ధి చేయమని వేడుకుని శేషశాయి రూపముతో ఈ స్థలములో విరాజమాను డయ్యేటట్టు చేసినట్తున్ను పిమ్మట వొక గోవు పాలు కార్చడం మూలముగా వూహించి పుట్టచేత కప్పబడియుంఛే స్వయంభు కృష్ణమూర్తిని కరిపాండ్యరాజు వేశేషక్షీరాభిషేకము వల్ల బయిలుపరచి దేవాగారాలు కట్టి తనపేరు సహితముగా కరికృష్ణుడని నామమరణముచేసి ఆరాధనచేయనుచూ వచ్చినట్టున్ను ఈ అరణ్యనదిన్ని ఈ స్థలమున్ను తదారభ్య యింద్రాదుల శాపాన్ని పోగొట్టి అనేకులను పావనులుగా చేయుచూ వుండేటట్టు విదితమయివున్నవి.

ఈ దినము వుట్లపండగ గనుక యిక్కడ భొజనానికి నిలిచి స్వామి దర్శనమున్ని చేసి నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములోవుండే విచ్చూరికి రాత్రి 2 గంటలకు చేరినాను. మధ్యాహ్నముమీద నడిచినదారి రేగడభూమి. బండిదారి వొకటి కాలిదారి వొకటి అంతు రెండుదారులు కలిగివున్నవి. కాలిదారిగానే నడుస్తున్నవి. వర్షాకాలము గనుక బహు ప్రయూసగా వున్నది. పొన్నేరికి 2 గదియల దూరములో యెలవంబేటి వద్ద కొరత లేదు నడుముల మట్టులోతు గనుక కాలినడకగానే దాటినాము. విశేష ప్రవాహకాలమందు పడవలు తెప్పలగుండా దాటవలసినది. విచ్చూరు లింగిశెట్టివారికి శ్రోత్రియగ్రామము. సంవత్సరానకు వెయివరహాలు యెత్తును. 30 బ్ర్రాహ్మణ యిండ్లు కలవు. సమస్త పదార్దాలు దొరుకును. చుట్టూ అశ్వద్ధవృక్షాలుగల రమణీయమయిన వొక తామరకొలను అగ్రహారమునకు