పుట:Kasiyatracharitr020670mbp.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్రము పూర్వము వున్న వొక గుంతను ఆసగాచేసి కట్టినాడు. మంచి మజిలీ స్థలము. సత్రము విశాలముగా వున్నది. సత్రములో తొవ్విన బావినీళ్ళు తేలికగానున్ను, రుచిగానున్ను వుంచున్నవి. భాటసారులకు కావలసిన సామానులు అన్ని దొరుకును. యిక్కడ భోజనము కాచేసు కోవడానకు మధ్యాహ్నము నిలిచినారు.

నెల్లూరిసీమ పుల్రుషులు, స్త్రీలు దేహపటుత్వము కలవారుగా నున్ను, యధోచితమయిన శుకచరూపము కలిగి సౌందర్య వతులుగా తోచు చున్నదిగాని దేహవర్ణము నలుపుకలసిన చామనగా తోచుచున్నది. గుణము నిష్కాపట్య ప్రధాన మని చెప్పవచ్చును. యీ మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో నుండే కోళూరురాజు సత్రము ఆరుగంటలకు చేరినాము. దారిలో పెరియవేడు అనే వూరువున్నది. అక్కడినుంచి బండి భాట గుమ్మడిపూడిమీద చీలిపోవుచున్నది. నేను వచ్చిన భాటలో పయిసత్రము సమీపముగా పడవలగుండా వొక వుప్పుటేరు దాటవలెను. చెన్నపట్టణమునకు సమీపగా వుండే కాకిరేనుకాలువకు నీళ్ళువచ్చే ప్రళయకావేరి అనే యేరు పోలూరుదాకా ప్రవాహకొలమునందు వచ్చుచున్నది. ఆయేరు యీ దినము దారి నడవడములో చూస్తూ రావచ్చును. నేడు మధ్యాహ్నము నడిచినదారి యిసకపర. పెరియవేడు మొదలుగా వుప్పుపయిరు చేసే అళాలు శానా వున్నవి. పయినవ్రాసిన సత్ర్ము నుంచి సుందరమయినతోట మధ్యే రెండుకట్లుగా కట్టి వున్నది. జలవసతి కద్దు. సత్రమువద్ద వొక అంగడి అయినా అన్నిపదార్ధాలు దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.