పుట:Kasiyatracharitr020670mbp.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరు యింటికి పావులావంతున వడ్డీకి అప్పుతీశి సారాయి మొదలయిన మత్తద్రవ్యములు తాగి ఆ అప్పులు మిక్కటమయితే తీర్చడానకు దేశాంతరములకు జతలుగా కలిసివచ్చి బోయీకొలువుచేసి మళ్ళీ దేశమునకు వచ్చి చేసియున్న అప్పులు తీర్చుకుంటూవుంచున్నారు. కొందరు బైటిసంపాదనకూడా తాగడానకు చాలక స్వదేశగమనమే పదిపదిహేనుయేండ్లు తలుచుకోకుండా వుంటారు. నాతోకూడావచ్చిన బోయీలలో యిద్దరు యీ దేశము వదిలి బహుకాలమౌటచేత వారి భార్యలు వారిని గుర్తుపట్టలేకపోయినారు. ఆ యిద్దరిని వారి యిండ్లస్త్రీలు మాకు తాగడానకు మేము కావలసినది యిస్తాము, యికమీరు దేశమువదలి పోవద్దని బతిమాలుకొనుచున్నారు.

యీ మత్తద్రవ్య పానమువల్ల లోకులకు యింత ఆసక్తియేల కలిగినదో అది యీశ్వరునికే తెలుసును. అయినా నాకు తోచడము యేమంటే యేలే బుద్ధి యనే రాజుయొక్క అధికారమునకు లోబడని దేహములోని మనసు మృతముయొక్క చేష్టలతో తిరుగులాడుచూ వుంచున్నది. గనుక ఆ మనసు యీషణత్రయబద్ధ మయి స్వప్నావస్థలోకూడా యీషణాదులను గురించి కలిగే విరోధములు అబద్ధములని జాగ్రదవస్థలో తెలిశిన్ని జాగ్రదవస్థ పొందిన వెనకకూడా స్వప్న సంభావితాలను జ్ఞాపకమునకు తెచ్చుకొని అవి సత్యములని కొంతసేపు భ్రమసి కొంచము దు:ఖించడము స్వానుభవముచేత నాకు తెలిశి వున్నది గనుక బుద్ధిచేత యేలబడని మనసుకు దు:ఖనివృత్యర్ధమున్ను యధోచితము బ్రహ్మానందవతుగా తాగడానకు మొదలు పెట్టినారనిన్ని అది పరంపరగా యెక్కువ అయి అనేకులు యీశ్వరుడు తమకు యిచ్చిన యథోచితమైన ప్రజ్ఞనుకూడా తాము పొగొట్టుకునేటట్టు పానాపేక్ష కలగడమయినది.

ఇంతదేశము తిరగడమువల్ల స్త్రీ పురుషులకు పరస్పర స్నేహమున్ను కలియకయున్ను మోహమున్ను ఆసక్తులున్ను పుట్టను కారణమేమని విచారించగా యిదిన్ని ఆహారములు, ఆచారములు, అలంకారములు వీటియెడల రుచిపుట్టేలగే గాని, యుక్కువలేదని తోచబడు