పుట:Kasiyatracharitr020670mbp.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనిమిత్తము ఆ దారివళ్ళ నిశ్చయించినాను. యీ మధ్యాహ్నము నడిచినదారి బహుదూరము రేగడ, అడివి నిండాలేదు. దారి కిరుపక్కలా కొంతదూరములో చిన్నకొందలు వుండివున్నవి.

గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరము మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.

యీవూరునుంచి బండ్లను రాజానగరములో నున్ను కలుసుకునే టట్టు పంపించి యిక్కడ బ్రాహ్మలయిండ్లలో వంట, భోజనము కాచేసుకుని రెండు గంటలకు బయిలుదేరి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే వంటిమామిడి యనే వూరు 6 గంటలకు చేరినాను. యీ వూరు చిన్నది. అయినప్పటికిన్ని యిప్పుఛు కోటీత్రియంబకరాయని వారు నడిపించే సదావృత్తి అన్నసత్రము వొకటి విశాలముగా కట్టివున్నది. అంగళ్ళు కలవు. సమస్తమయిన పదార్ధములు దొరికినవి. యీ వూళ్ళో యీ రాత్రి వసించినాను.

12 తేది వుదయాత్పూర్వము 4 గంతలకు బయిలువెళ్ళి యిక్కడికి 9 కోసుల దూరములో నుండే నగలాపల్లె అనే వూరు 10 గంటలకు చేరినాను. తుని మొదలుగా దారి దక్షిణాభిముఖముగా వచ్చినందున కొండలు దూరమై సముద్రము దగ్గిర అవుతూవచ్చినది. కన్యాకుమారి మొదలుగా కలకత్తావరకు యీభూమిగడ్డను సోగతమలపాకు అందమయ్యేటట్టు సముద్రము ఆవరించి వున్నందున మనము దక్షిణాభిముఖముగా వఛ్ఛే కొద్ది సముద్రతీరానకు సమీపముగా రావడమైనది. గంజాం మొదలు సముద్రతీరమందే వచ్చేటట్టు చెన్నపట్టణమునకు వొక బాట వున్నది. ఆభాట సమీపమయినా వుప్పుకాలువలు అనేకముగా దారిలో దాటవలసి వున్నది గనుక ఆమార్గము నుంచి కుంఫిణీవారు పడమరవొత్తి శాలవేసినారు. సముద్రతీరువు భలేను వుప్పుకటారులు త్రిరోదయం యెటున్నదో అటువంటి దారిని