పుట:Kasiyatracharitr020670mbp.pdf/373

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జిల్లాలో 100 కి 24 వంతున లాభమువచ్చును. అయినా బందిపోట్లవల్ల నిండా నొచ్చిపోవుచున్నారు. నక్కపల్లి, వుపమాకా యనే వూళ్ళున్ను చేరినట్టుగానే యున్నవి. మధ్యే వొక చెరువుకట్టకద్దు. వుపమాకాలొ వొక శివమందిరమున్ను, దానిలో చేరినట్టు వొక సత్రమున్ను వుండగా అందులో దిగినాను. నక్కపల్లెలో అన్ని పదార్ధములు దొరుకును.

యీ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్ను అగుపడుతారు. జాఫరావిత్తుల వర్ణముచేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడము కలిగివున్నది.

సర్వసాధారణముగా యీ దేశమందు తెనుగుభాష ప్రచురముగా వున్నది. మాటలు దీర్ఘముగానున్ను దేశియ్యమయిన శబ్దహ్రస్వముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసుమోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావమూఅ దౌష్ట్యములు చేయతలచినా మంచితియ్యని మాటలుమాత్రము వదలరు. యేపనిన్ని వూహించి చేస్తారు. యీ వూళ్ళో రాయవరపు మునిషీ కోటూరు వీరరాఘవమొదిలిని కలుసుకొనే నిమిత్తము యీ రాత్రికూడా నిలిచినాను.

17 తేది వ్దయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 4 కోసులదూరములో వుండే తుని యనే వూరు 7 గంటలకు చేరినాను. యీవూరివద్ద తాండవ మనే నది వొకటి, కసంకోటవద్ద శారదా అనే వది వున్నట్టె వొకవాగున్నది. యీ తాండవనదికి అవతలిపక్క రావుపేటాయనే వూరు వొకటి వున్నది. అక్కడ తపాలాఆఫీసు రయిటరు వొకడు ఆఫీసును వుంచుకుని వున్నాడు. ఈ రెండువూళ్ళుగొప్పబస్తీలు. యిక్కడ హేడ్డాపోలియను వసముచేయుచున్నాడు. సమస్త పదార్ధములు దొరుకును. యీవూరినుంచి రాజమహేంద్రవరానము కుంఫిణీవారు వేసిన లయను దారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తము లేకపోవుచున్నది. ఆ దారి వొక ఆమడ సమీపమయినప్పటికిన్ని, బండ్లదారి అయివున్నా నాతొకూడా చెన్నపట్టణమునుంచి వచ్చిన బోయీలయిండ్లు పిఠాపురపుదారిలో వున్నందున వారి సంతో