పుట:Kasiyatracharitr020670mbp.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీగౌడ దేశములోనున్ను వుత్కల దేశములోనున్ను చింతపండు మిరపకాయలు విస్తారముగా మన దేశమువలె తినక పోయినా మనదేశస్థుల నిమిత్తము కావలసినవి అంగళ్ళలోపెట్టి వుంచుతారు. యెండు మామిడి వరుగు చింతపండుకు బదులుగా వాడుతారు. మామిడిచెట్లు అమితముగా కలవు. శాలలోకూడా అవేపెట్టి పయిరు చెస్తూవున్నారు. యీ దేశపు బోయీలు మిట్టలు యక్కవలసినప్పుడు హరిబోలో అనే మాటతో కంఠధ్వని వుగ్గళించి చేయుచూ వచ్చుచున్నారు.

12 తేది ఉదయాత్పూర్వము 4 గంటలకులేచి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే కటమమనే షహరు 11 గంటలకు చేరినాను. దారి సడక్కువేశి గట్టిపడి వున్నా నిన్నటి దినము అమితమయిన వర్షము కురిశినందున దారినిండా అడుసుగా వుండినది. ఆ కటకముముందు రెండుకోసులు కద్దనంగా సడక్కులోనుంచి నొక కాలువ చీలి మహానదిలో కలిసినది. ఆదారి గులకయిసుక పరగా వుండినది. ఆ మహానది కటకము చుట్టుకొని ప్రవహింపుచున్నది. ఆ నది రెండుకోసుల వెడల్పు కద్దు. యీ నది వింధ్యపరతములో వుత్పత్తి అయి కటకానికి సమీపముగానే సముద్రగామి యయినది. వైతరణినది మొదలుగా కటకము వరకున్ను అతి ఘోరమయిన అడవిగా లోగడ వుండినది. యిప్పుడు కుంఫిణీవారు కలకత్తాలో వుండే బంగాళీధనికులు కూడా ఆ అడివి కొట్టించి సడక్కు వేయించినారు.

కటకముపూర్వమందు ఢిల్లీ కింద వుండినది. అక్కడిపాధుషా కుటుంబస్థులకు అంత:కలహము కలిగి అరాజక మయిన మీదట నాగపూరు యేలుతూ వున్న షాహురాజు వంశస్థులు యీ నెట్టునవున్న అధికారస్థులను కొట్టి తీసుకున్నారు. పిమ్మట యింగిలీషువారు పునాషహరు స్వాధీనము చేసుకొని క్రమక్రమముగా హిందూస్తాన్ సమగ్రముగా స్వాధీనము చేసూంటూ వచ్చేసమయములో నాగపూరున్నాసాహేబుతో కలహప్రసక్తి అయినది గనుక ఆకలహము ఆకరము చేసుకొని కటకపుజిల్లా స్వాధీన పరుచుకొన్నవారై పిమ్మట నాగపూరు రాజ్యము ఆరాజు సంబధికుని అధీనము చేసినప్పుడు యీ కటకపుజిల్లా ఢిల్లీ పాధుషాది గనుకనున్ను ఆ ఢిలీతక్తుయిప్పట్లో తమచేతికింద వున్నది గనుక అన్యా