పుట:Kasiyatracharitr020670mbp.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుదకము బయట పారుతున్నది. తిరుకొలను వదిలి 100 బారల దూరము పొయ్యేదాకా వుదకము యొక్క వుష్ణము యెక్కువ గనుక చెయి నిండాసేపు వుంచ సహ్యముకాదు. తిరుకొలనులో వుదమము మీద పొగలు పారుతూ వుదకమునద్ది మెట్లను వుష్ణము చేయుచూ కిందమంట వేస్తే తపిలలోని వుదకము పొంగుతూ వుంచున్నది. లోకులు పూజార్ధము ఆ కొలనులో బియ్యము వేస్తారు. ఆ బియ్యము రెండు మూడు దినములకు నాని తూముగుండా బయిటికి వస్తున్నది గాని పచనము కావడము లేదు. యల్లీసు దొర కోడిగుడ్డును యీ వుష్ణోదకములో వుంచితే పక్వము కాలే దని వ్రాశినాడు.

యీ వుదకము యేప్రల్ నెలలో వచ్చే శ్రీరామనవమి మొదలుకొని యిక్కడా వర్షాకాలము ఆరంభమయి శ్రావనమాసము దాకా శీతకరముగా వుండి వర్షప్రదము కాగానే వుదకము మళ్ళీ వుష్ణము కాసాగి శీతకాలమునందు చెప్పితీరని వుష్ణమవుచున్నదట. యిక్కడ సంవత్సరానికి వకసారి అయ్యే వుత్సవములో బహు జనసమ్మర్ధము చేత మనిషి కాలుజారి ఆ కొలనులో పడితే చర్మమువూడి నాలుగయిదు దినములలో దేహమునకే అపాయము వస్తున్నదట. యిప్పట్లో ఆగుండములో నుంచి ముంచిన ఒక కుండ గంగలో సుమారు రెండు కుండల చల్లని గంగపోసి చల్లర్చి స్నానము చేసినాను.

ఆ తీర్ధానికి చుట్టున్ను రామగుండము లక్షమణగుండము అనే తీర్ధములు నాలుగు అయిదు కొలనుల వలెనే కట్టియున్నవి. వాటి వుదకము చల్లనే గాని, వుష్ణముకాదు. వాటి వుదకము వూటే గాని సీతాగుండమువలె వుదకము వుదకము నదివలెనే సదా స్రవింపుచు పారడములేదు. యీ వుష్ణోదకము కనిపెట్టకూడని వొక సువాసనగా వున్నది. అది నిండా మాధుర్యము లేకపోయినా పానానికి సహ్యముగా వున్నది. పానానంతరము నోరు కొంచెముగా పుల్లగా వుంచున్నది. స్నాన పానానంతరము ఒకవిధమయిన సువాసన మన దేహాన్ని అనుసరించి కొంతసేపు వచ్చే వుచ్చ్వాస నిశ్వాసాలతో తెలియవచ్చుచున్నది.

నల్సెటిర్ యేసిడ్ అనే గంధక ద్రావకము వుదకములో కలిసి