పుట:Kasiyatracharitr020670mbp.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుదీచితీర్ధమని, ఖనఖలతీర్ధమని, దక్షిణమానస తీర్ధమని, మూడు పేళ్ళతో పిండ ప్రదానాలు చేసి అక్కడ మందిరములో వుండే సూర్యమూర్తి దర్శనము చేసుకొని ఫల్గుని నదికి ఒక పిడత అన్నము తీసుకుని వచ్చి అక్కడ గదాధరునికి యెదురుగా పిండప్రదానముచేసి, గధాదరునికి అభిషేక పూజలు చేసి, దర్శనము చేసుకుని అక్కడికి కొంతదూరములో వుండే పితామహేశ్వరుని దర్శనము చేసుకుని, రావలసినది. రామపర్వతములో, ప్రేత పర్వతములో ప్రేతగయావళీల పూజ చేసి నట్లు యీ స్థలాలలో స్వంత గయావళీ పూజచేస్తూ రావలసినది. యీ ఫల్గుని నదికి అనేక స్నానఘట్టాలు కట్టి వున్నారు. గయావళీల యిండ్లు అనేకముగా ఫల్గునీ నదీతీరమందుకూడా శానా గొప్పలుగా కట్టివున్నవి యీగయవాళీలకు కాపురము వుండే యిండ్లు గాక పరువుకలవారు బయటకు అని కచ్చేరి కూటాలు వేరే కట్టుకుని వుంటారు. ఆప్రేత గయావళీలు యీ గయావళీలను వుపసర్పించుకొని వుంటారుగాని వారికి స్వతంత్రదశ వున్నట్టు అగుపడ లేదు. గదాధర స్వామిపూజ ప్రేతగయావళీలది. విష్ణుపాద పూజ శుద్ధగయావళీలది.

6 రో దినము, ధర్మారణ్యం బౌద్ధగయ అనే ప్రదేశాలకు పోవలసినది. యీ ప్రదేశాలు షహరుకు 4 కోసుల దూరములో వుంచున్నవి. పోయిరావడానకు అస్తమాన మవును. యీ ప్రదేశాలు క్షేత్రానికి పశ్చిమ భాగమందున్నవి. యిక్కడ ఒక గోసాయి పీఠస్థుడు జాగీరు అనుభవిస్తూ వచ్చినవారికి సదావృత్తి యిస్తూ వుంటారు. యీ స్థళము గయనుంచి కలకత్తావెళ్ళే భాటలో వున్నది. ఇక్కడ దెహబ్రహ్మవాదుల బౌద్ధగుడి ఒకటి యున్నది. అక్కడవుండే ప్రతిమలు బ్రహ్మదేశములో నుంచి జాతులవాండ్లు తెచ్చిన ప్రతిమకు సరిగా యున్నవి. ఆ గుడి చూడగా 200-300 యేండ్లకిందట కట్టినట్టు అగుపడుతున్నది. ఆ మతస్థుల ప్రబలము యెప్పుడు యీ ప్రాంత్యాల అయివున్నదిన్ని ఖుల్లముగా తెలియలేదు. యిందుకు వుత్తరము జయపురము, జోతీపురము, బిక్కానెరి అనే మారువాడి దేశాలు మొదలుగా దేహబ్రహ్మవాదుల నివాసభూమి గనుక పూర్వము ఒక కాలము