పుట:Kasiyatracharitr020670mbp.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందు వారు యిక్కడ ప్రవేశించి పిమ్మట యీ కర్మ భూమియందు నిలవలేక ఖిలల్పపడి వుందురు.

యిక్కడ వుండే గోసాయి మహంతు సంత్రాసునింబూ అనే నారదపు కాలలలో అనేక లవణాలు పిప్పలి, శొంఠి, మొదలయిన జీర్ణకారి పదార్ధాలు కూరిపోశి యెండపెట్టి వచ్చినవారికి మెప్పుగా తారతమ్యము విచారించి యిస్తాడు. యీ దేశములొ ఆహార పదార్దాలు బలకరమయినవి గనుక అజీర్తిమాద జ్వరాలు వస్తూవుండుట చేత పాచక మనే మందులు కరక్కాయలు, జీలకర్ర, పిప్పళ్ళు, వోమము మొదలయిన వస్తువులను భావన చేసి అటువంటి పదార్దాలు నారదపు కాయలు మాదీఫలములలో యిమిడ్చి యిక్కడ చెయ్యడమే కాకుండా నేపాళాన్నుంచి అనెకముగా తెప్పించి అమ్ముతూ వుంటారు. ఆ సంత్రాసునింబు అనే పండ్లలో సూదులు గుచ్చి పెట్టితే సూదులు కరిగి పొతున్నవని వదంతి. యీపాచక ఔషధాల దినుసులకు యిక్కడ లెక్కలేదు. యీ ఔషదాలు జీర్ణకరములై భేదికారిగా వున్నవి.

గయావళీలు వచ్చిన ప్రభువు ప్రసన్నుడయితే అంతకు మిక్కిలి పండగ వేరే లేదు గనుక కలిగిన భూషణాదులు అలంకరిచుకుని వుండే నల్తముతొకూడా యిటువంటి పిండదానము చేసే ప్రదేశాలకు యజమానుడితో కూడా వచ్చి చేశే పూజలు ప్రతిగ్రహిస్తారు. ఒక నూత్రులయితే షోడశిని కూడా పిల్చుకుని వెళ్ళి యీ ముందు వ్రాసిన స్థలములలొ నంతా పిండదానాలు చేసి రావలసినది. ఆ బౌద్ధ గయలో జగన్నాయకుల గుడి వొకటి వున్నది. పయిన వ్రాశిన మహంతుతొట ఒకటి గొప్పదిగా నున్ను సుందరముగా నున్నది. ఈదినము నాలుగు తావులలో పైన వ్రాసిన ప్రకారము పిండదానాలు చేయడమయినది.

7 డో దినమందు లేచి తొలుదినమే బౌద్ధగయ చేశేనాడే చేస్తే నిండాప్రయాస అవుతున్నది గనుక యీదినము క్షేత్రానికి అతిసమీపముగా వుండే బ్రహ్మసరస్సుకు వెళ్ళీ అక్కడ పిండదానము చేసి కాక బలి, యమబలి, శ్వాసబలి యనే మూడుబలులు అక్కడికి సమీపముగా