పుట:Kasiyatracharitr020670mbp.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేతగయావళీల ప్రదేశము గనుక భం అనె ధ్వనితో వారు సుఫలము యియ్యవలసినది. యీ కొందమీదనున్ను వుదకములేదు. అష్టగయ చేయని మనుష్యులను యీకొండమీదికి కూడా రానియ్యరు. యీ కొండ దిగివచ్చిన వెనక కింద మూడు తావులలో పిండప్రదానాలు చేయవలసినది గనుక నేటిదినము దిగివచ్చే టప్పుడు పాదచారిగానే దిగిరావలశినది. యీ పిండపిచ్చులు వగయిరాలు పావుశేరు బియ్యముతో అక్కడక్కడ పిండప్రదానాలు చెస్తూవస్తే అష్టగయకు రెండురూపాయిలు వంతున యివ్వవలసినది. అర్ధశేరుకు రూపాలు 4, శేరుకు రూపాయిలు 2 దేలెక్క ప్రకారము షోడశికిప్రేతగయావళీలకు నిష్కర్ష గనుక బియ్యపుమూయినకు తగ్గట్లు తిలలు మొదలైన సామానులు యిస్తాడు. యీ దేశములో తెల్లనువ్వులు విస్తారముగా వున్నాయీ పితృకర్మాలకు వాడడము నల్లతిలలేదు. దర్భదొరకదు గనుక యీ దేశమునందు యావత్తు అతి కోమలముగా పెరిగే కుశనుప్రతిగా వాడుకుంటున్నారు. ప్రతి పిండప్రదానానికి కారుణ్యాల సహితముగా పిండప్రదానము కాగానే ధర్మపిండాలని 40 శ్లోకాలతో 4-0 పిండాలు వేయవలచినది. యీధర్మపిండాలు ప్రతి పిండప్రదానకాలందు వెయ్యవలసినది. 'పితృవంశే మృతాయేచ 'అనే శ్లోకాలతో ధర్మపిండాలు వేయవలసినది.

4 దో దినము పంచతీర్ధాలనే 4 ప్రదేశాలలో పిండప్రదానాలు చేయవలసినది గనుక 4 పిడతలు హాజ రయి వుంచున్నవి. వాటిని సాహెబుగంజు వద్దవుండే వుత్తరమానస తీర్ధానికి తెచ్చి అయిదు పిడతలలొ అన్నము ఒకసారిగా పక్వముచేసుకుని ఆతీర్ధము ఒక గుంట ఆకారముగా వుంచున్నది గనుక ఆతీర్ధము వొడ్డున నొక సారి పిండప్రదానముచేసి అక్కడ గుళ్ళోవుండే సూర్యమూర్తి దర్శనము చేసుకుని మౌనవ్రతముతో దక్షిణమానసతీర్ధము అనే సహరునధ్యైవుండే నొక పెద్దగుంటకు కడమ, నాలుగు పిడతల అన్నము పిడతలతోనే యెత్తుకుని రావలసినది. యీ రెండు మానవతీర్ధాలు రమణియ్య మయినవికావు.

ఆ దక్షిఅణ మానస తీర్ధములోనే మూడు తావులలో