పుట:Kasiyatracharitr020670mbp.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శపించినట్టున్ను ఆపిమ్మట వారు పశ్చాత్తపులై బ్రహ్మను శరణు చొచ్చినంతలో యిక్కడ పితృకర్మాలు చేసేవారు మిమ్ములనే ఆరాధింపు చున్నారు; అందువల్ల జీవనము చేయం డని ఆజ్ఞ యిచ్చి నట్టున్ను అదే పురాణములో వ్రాసియున్నది. ఆ బ్రాహ్మణ కల్పన కాలమునందు వారికి సమానులయిన స్రీలను ఉత్పత్తి చెయలేదు గనుక యీ క్షేత్రములొ మిక్కటముగా వసియింపుచు నుండే మేదరజాతి స్త్రీలను వారు పరిగ్రహించి తద్వారా వంశము వృద్ధిఅయి నట్లున్ను అందువల్ల అవ్యాపి స్త్రీప్రజ వీరిలో వంటవార్పులకు పనికిరాకుండా బోగార్ధమునకు మాత్రము ఉపయోగింపుచు వుండేటట్టు యిక్కడా ప్రసిద్ధముగా నున్నది. యీ గయావళీలు భార్యలచేత భోజనము చెయ్యరు గనుక మన దేశము నుండి వచ్చిన అనాధస్త్రీలను స్వయం పాకమునకు కొలువు పెట్టుకొంటారు. తమస్త్రీలచేత నీళ్ళు తాగేది లేదని చెప్పడము. యీ గయావళీల స్త్రీలు యధోచిత మయిన రాణివాసము గలిగి వుంటారు. యీగయావళీలకు యెనిమిది యేండ్లలోనే వివాహమవుచున్నది. రెండోపెళ్ళికిపడుచును యివ్వడములేదు. వీరి ఆజ్ఞకు తగ్గట్టే వివాహము మొదలయిన విషయములలో వీరికిప్రయము యెక్కువగా అవుచున్నది. వీరియిండ్లలో స్త్రీప్రాబల్యము యెక్కువ అని ప్రసిద్ధి. గయాఫళీల విద్యావివేక విషయాలళొ బ్రహ్మశాపము వ్యర్ధమయినట్టు తోచలేదు. వారి ఆచారాలు యీ దేశానకు తత్కాలానుగుణముగా వున్నా మన దేశస్థులకు యేహ్యముగా నున్నది.

4 గో దినము ప్రేతపర్వతము దారిలొనే షహరుకు 2 కోసుల దూరములో సాజెబుగంజుకు చేరినట్టుగా రామపర్వత మనే కొండవున్నది. అక్కడికివెళ్ళి నాలుగు ప్రదేశాలలో నాలుగు ఆవృత్తులు పిండప్రదానాలు చేయవలసినది. కొండమీద శివమందిరము, రామమందిరమున్ను వున్నవి. గనుక ఆ అమందిరాల సన్నిధిలో పిండప్రదానము చేయవలసినది. యీకొండ యెక్కడము నిండా యెక్కుడు కారు. 140మెట్లు యెక్కవలసినది. మెట్లు నిండా పొడుగుకావు. యీ పర్వతముమీదను పిండప్రదానముకాగానే యిక్కడకూడా