పుట:Kasiyatracharitr020670mbp.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హోలుకరురాజధాని హిందోలి అనే షహరు. శింధ్యాపడిపోయిన వనక వాడికి వున్నలక్షమంది మార్బలము చేదరనియ్యకుండా పట్టుకొని దత్త పుత్రిడితొ హింసపడుతూ శింధ్యాబార్య కాలము గడుపుతూన్నది. ముందరి శింధ్యారాజధాని హుజనీపట్నము. యిప్పట్లో గవాలియ్యరులో దండు సమేతముగా అతని కుటుంబము వాసము చేస్తూవున్నది. లక్కునో నవాబు ధనము విస్తారముగావున్నా లక్షపౌజు వున్నా ప్రజలను హింస పెట్టుతూ* పేరుకు నవాబుగా వున్నాడు. జోతీపురము జయపురము బిక్కానెరి రాజులు మారువాడీలు గనుక యీశ్వరుడు వారికి యిచ్చిన సిర్జల భూములలో యున్నారు.

జ్వాలాముఖి యనేస్థలము రణజిత్తుశింగు రాజ్యములో వున్నది. ఆదేవిని అతడు బాగా ఆరాధింపు చున్నాడు. అతని రాజ్యములొ యిప్పటికిన్ని న్యాయము బాగా జరుగుతూ ప్రజలు బాగా పరిపాలింపబడుతూ యున్నారు. యీదేశము మొదలు కాశ్మీరములొగా సారా అనిన్ని, బరువు అనిన్ని మంచుగడ్డలు పడుచున్నవి. యింతమంచు నీభూమికి పెట్టిన ఈశ్వరుడు ఈ భూమినివాసుల క్షేమముకొరకు ఉష్ణోదకపు పూట కలిగిన గుండములు కొన్ని నిర్మించి ఉన్నాడు. అవియెక్కడ వంటే గయనుంచి జగన్నధానికి పొయ్యేమార్గములో బలుబలు అనేవూళ్ళో వొకటి; గయకు కొంతదూరములో రాజగృహీ అనేవూళ్ళో ఒకటి; మూంగేరి అనేముంగా చీరలు అయ్యే గంగవొడ్డుషహరుకు సమీపముగా సీతాగుండ మనేది వొకటి; హుజ్రి దేశములో తప్తమణికర్ణిక అనే గుండాము వొకటి; డాకాదేశములో బాలవాగుండ మనేది ఉదకము మీద జ్వాలలు లేస్తూవుండే గండము వొకటి; బదరీ నారాయణమువద్ద వుండేది వస్తువులను వేడిచేసే గుండము వొకటి, యీప్రకారము ఈశ్వరుడు సృస్టించి వున్నాడు. తప్రమణికర్ణికలో బియ్యము మూటకట్టి వేస్తే అన్నముగా పచనమవుచున్నదట. ఈ వుష్ణగుండముల వుదకము యావత్తు గంధకపు వాసన కలిగి వున్నట్టు విచారణమీద తెలిసినది. సదా జ్వాలలు


  • ఇది ఇంగ్లీషువారు వ్యాపెంప చేసిన వదంతి యని బిషప్ హెబరుగారు 1824లో స్వయముగా చూచి వ్రాసినారు.