పుట:Kasiyatracharitr020670mbp.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగి వుండే జ్వాలాముఖి గుళ్ళోనున్ను ఆ ప్రకారమే గంధక పరిమళము సదా కలిగి వున్నట్టు తెలియవచ్చినైది. నాయిక్తితో విచారించగా పయి భూములలో శీతము కలుగ చేసిన ఈశ్వరుడు భూమి కింద వుష్ణంకు కలిగివుండే కొరకు గంధమము విస్తారముగా వుత్పత్తి చేసినాడనిన్ని, అగ్ని గంధములో పుట్టడము సహజము గనుకనున్ను యీ గంధకము కలిగిన ప్రదేశములలో పుట్టే వూటజలము సహజముగా ఉష్ణముగా వుండేటట్టు తోచుచున్నది. జ్వాలాముఖిప్రదేశములొ ఆరాధన నిమిత్తమయి గంధకద్వారా భూమిలో జ్వాలను ఈశ్వరుడు సదా కలగచేసినట్టు తొచుచ్ఫున్నది. జ్వాలాముఖి స్వారూపముగా వుండే మహామాయ రణజిత్తుశింగుకు ప్రత్యక్షముగా యిష్టసిద్ధులు చేయుచూ యున్నది.

జ్వాలాముఖికి కొంత దూరములో రేవాలేశ్వర మనే తటాకములో అద్యాసి రెండు పెద్ద గుండ్లు పర్వతాకారముగా తేలుతూ లోకుల యారాధనలను అంగీకరింపుచు సంచరిస్తూ వుండేటట్టు నిశ్చయముగా తెలిసియున్నది. ఆ శిలల స్వభావము యెటువంటిదో తెలిసినదికాదు. కాలక్షేప నిమిత్తమయి సృష్టించిన యీ సృష్టిలో అటువంటి ఉదకము మీద తేలే శిలలు వుంటే యేమి వింత! అయితే దానికిన్ని హేతువు గర్భములో వున్నదని తొచుచున్నది.

నేపాళ దేశములో దేవప్రయాగ అనే వూరు వొకటి వున్నది. అందులో భగవత్పాదులవారు శ్రీరామమూర్తిని యంత్ర సహితముగా స్థాపించి కర్మకులుగా వుండే ద్రావిళ్ళు ఆ మూర్తిని ఆరాధన చేసేటట్ట్లు నియమించి ద్రావిళ్ళను కొందరిని అక్కడ వుంచినారు. ఆద్యాపి వారు అక్కడ వుండి పుట్టే ఆడబిడ్డలను యీ దేశములో నుంచి వచ్చే ద్రావిళ్ళకు స్థితులు వ్రాసియిచ్చి వివాహము చేసియిచ్చి అక్కడనే వుంచుకుంటూ వచ్చుచున్నారట. ఆటు జరగడమువల్ల ద్రావిడ దేశస్థుల యిండ్లు యిన్నూరుదాకా ఆ దేవప్రయాగలో యేర్పడి వున్నవి.

ద్రావిళ్ళ ప్రవేశము కావడములో యీ దేశములో యింతే కాకుండా మొన్నూరుయేండ్ల కిందట ద్రావిడి యయిన యొక వెలనాటి