పుట:Kasiyatracharitr020670mbp.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రముగా తురకలలోకలిసి బ్రాహ్మణుడు అప్ర్రాంత్యాల తలచూపడము అద్యాసి ప్రయాసగా నున్నది.

ఇప్పట్లో ఆ రాజ్యము రణజిత్తు సింగు* అధీనముగా యున్నది. ఆకాశ్మీరములోనే కుంకుమపువ్వు అవుచున్నది. శాలూలు నేయడానికి యోగ్యమయిన వెంట్రుక లయ్యే మృగాలు ప్రత్యేకముగా ఉత్పత్తి అవుచున్నవట. కాశ్మీరశాలూలు బయటికి విస్తారము రావటములేదట. అందుకు నకలుగా లాహోరులో నేసిన శాలూలు బయటికి విక్రయయానికి వచ్చేటట్టు విన్నాను. నిరక్షదేశము మొదలుగా 23 భాగల దూరము లో నుండే కాశీ లొగానే కాలము మొదలుకొని ఆచారవ్యహారములు యింత భేదించి యుండగా యికను ఉత్తరోత్తరా యేమి వింతగా నుండునో తెలిసినది కాదు; వీపుమీద నుండే మచ్చ చూడడానకు కూడా మనుష్యుడు శక్తుడుకాడు. మాయావృతజ్ఞానము కలిగి వుండుట మిక్కటముగా యీ ప్రకారము మాయామగ్ను లయిన అస్మదాదులను కాపాడ వలసినది.

1830 వ స|| డిసంబరు 28 తేది పట్నా అనే షహరు ప్రవేశించినాను. గంగలో పదిదినములు బజరా పట్టేలు అనే పడవల గుండా నడవడమయినది. దారిలో గంగ కిరుప్పక్కలనున్న వూళ్ళ పేళ్ళు ఈ అడుగున వ్రాయుచున్నాను. నెం.21.కబారా 1 మంజీ 1 ఛోటక్పూరు 1 కనాలుగంజి 2 సయత్పూరు 1 మాంజీ 1 చోబక్పూరు 1 రోజా 1 జిమ నియ్యాం 1 రాంపూరు 1 మదనా పూరు 1 గాజీపూరు 1 కాతిసుపూరు 1 నెరువూరు 1 బకుసరు (బక్సార్) 1 నిక్కావూరు 1 బుదాగా 1 కట్రాజిగంజి 1 బిసన్ పూరు 1 ఆరా 1 నవరంగా 1 రామనగరము 1 శిరువూరు 1 శిరంపూరు 1 చప్రా 1 రస్తాన్ గంజి 1 దానాపూరు 1 బాకీపూరు 1 పట్నా 1.


  • రంజితసింగు శిక్కుల రాజు. 1780 లో జన్మించి 1839 లో దివంగతుడైనాడు.