పుట:Kasiyatracharitr020670mbp.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగయిదు లక్షలు సెలవుచేసేపాటి ఆసామి ఒకడు యీస్థళమందు వసింపుచున్నే యుంటాడు. ఇప్పట్లో శ్రీమంతుని తమ్ముడు బిమ్మాజీ అనే అతను నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు ఛేసుకుంటూ అసి తీరమందు యున్నాడు. యింకా యీదేశపు బహు ధనికులు విరామదశను పొంది కాశీవాసము చేయుచున్నారు. యీక్షేత్రాన అవశ్యముగా చెయ్యవలసినపనులు వాసము ఒకటిన్ని వర్షాశనదానము ఒకటిన్ని ముఖ్యములు.

కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షప్రజలున్ను వుందురని తోచుచున్నది. *యిక్కడ దొరకని పదార్ధము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందూస్థాన్ మాటలాడు చున్నారు. బాహాటమయిన సంత అంగళ్ళను బాళాలని వ్యవహరింపుచున్నారు. ఉత్సవాదులను మ్యాళా అనిన్ని, పల్లకీలను కడుకడియా అనిన్ని, బోయీలను కారులోకు అనిన్ని వాడుతారు. బొందిలీ ఖండములో బోయీలను డీమరు అంటూవచ్చిరి. సామాన్య నౌకరుల జీతము నెలకు 4 రూపాయలకు యెక్కువ లేదు.

యీ స్థల మాహాత్మ్యము స్కాందపురాణాంతర్బూతముగా వుండే కాశీ ఖండములో 100 అధ్యాయాలుగా విస్తరించి చెప్పబడుతునున్నది. యిదిగాక సూక్ష్మముగా 5 అధ్యాయాలు గల కాశీ మాహాత్మ్య మనే గ్రంధమున్ను విస్తరించబడి యున్నది. వాటి సార


  • బిషప్ హెబరుగారు 1824 లో కాశిని దర్శించి తన దినచర్యలో చక్కగా వర్ణించియున్నారు. అదిచాలా విషయములలో వీరస్వామయ్యగారు వ్రాసినదానికి సరి పోతున్నది. జనసంఖ్య విషయంలో మాత్రం వీరాస్వామయ్యగారు పొరబాటుపడినట్లు కనబడుతూవుంది. హెబరుగారు వ్రాయడంలో 1808 లో వేయబడిన ఒక జనాభా లెక్క ప్రకారం కాశీలో 5,82,000 ప్రజలు వున్నట్లు తేలిందనిన్నీ దానిలో కొంతమంది అతిశయోక్తి వున్నదనుకున్నా, ఉన్న లెక్క అది ఒక్కటేననిన్నీ, పట్టణ వైశాల్యము బట్టిన్నీ క్రిక్కిరిసియున్న కట్టుడును బట్టిన్నీ ఆ అంచనా యించుమించుగా సరియైనదేనని తొస్తూ వున్నదనిన్ని, లండన్, ప్యారిస్ నగరాలు తప్ప ఐరోపాలోని తక్కిన అన్ని నగరాలు కన్నా యీ కాశీనగరం ఎక్కువ జనాకీర్ణంగా వున్నదనిన్నీ వ్రాశారు. చూడు. బిషప్ హెబర్సు జర్నల్ 1 వ సంపుటము, పుటలు 370-400.