పుట:Kasiyatracharitr020670mbp.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్చకులు, వచ్చిన ఉపపన్నులను యాచిస్తూ పేదలు ఇచ్చేదాన్ని పుచ్చుకొంటున్నారు.

యీక్షేత్రములో పర్వత ఆలయములలోని అర్చకులు పంచగౌడులతో చేరినారు. కాలభైరవుని అర్చకులుమాత్రము కానుపడాలని ఒక వింతజాతివారు. చెవులు మధ్యప్రదేశములో బొందచేసుకొని స్ఫటిక బిళ్ళలను ధరించియున్నారు. మణికర్ణికా ఘట్టమునందు గంగాపుత్రులున్ను ఘూర్జరులున్ను వసింపుచున్నారు. దుర్గాఘట్టాములో మహాజను లనే సాహుకారులు పూర్వీకులైన స్థలజ్ఞులున్ను వసింపుచున్నారు. కేదారఘట్టములో కంగాళీలనే దక్షిణదేశస్థులు యాత్రార్ధముగా వచ్చినవారు మిక్కటముగా వసింపుచున్నారు. దుర్గాఘట్టములో ఇండ్లు వున్నతములుగా అంతస్థులు యెక్కువగా కలిగి యున్నవి.

మణికర్ణికకు దక్షిణమున సమీపముగా చౌకంబా అనే గుజరీ అంగడి యున్నది. యీపట్టణములో పీతాంబరాలేమి సకల విధములయిన వస్త్రములేమి అపూర్వము లయినవి కావలసినంత మట్టుకు దొరుకును. పాత్రసామానులు అపారముగా అమ్ముతూ ఉన్నారు మహాజనులు రత్నాలు మొదలయినవి అమ్ముతూ వున్నారు. లక్కునో *మొదలయిన సమస్థానములకు కావలసిన ఆభణాలు రత్నములున్ను యిక్కడి నుంచి పోవుచున్నవి.

పట్టణానికి వుత్తరముగా గంగా సంగమము అయ్యే వరణ పట్టణమును చుట్టుకొని పడమరగా ప్రవహింపుచు దక్షిణమున అసితో


  • లక్కునో అయోధ్య నవాబు రాజధాని.

ఈనవాబు మొగలాయి చక్తవర్తికాలములో రాజప్రతినిధి తరువాత స్వతంత్ర రాజు. ఇంగ్లీషువారు ఇతనితో స్నేహంచేస్తూ ఇతనివల్ల చాలా సొమ్ము సంపాదించారు. ఇతని దర్భారు అతివిభవంగా వుండేది. ఇతడు దొరల మెప్పుకోసం అమితసొమ్ము ఖర్సుపెట్టి అప్పులపాలైనాడు. అత్యధికవడ్డీలతో ఇతనివల్ల దొరలు చాలా పత్రాలు వ్రాయించుకొన్నారు. అయోధ్యరాజ్యం పాడిపంటలతో తులతూగుతూ సుభిక్షంగా వున్నందువల్ల ఎలాగైనా దీన్ని కాజెయ్యాలని కంపెనీవారితని పరిపాలన బాగులేదని ప్రజలు భాధపడుతున్నారని దుష్టప్రచారంచేస్తూ చివరకు 1857 లో ఇతని త్రోసి రాజన్నారు. ఈ నవాబు సద్గుణాలను విభవాన్ని బిషప్ హవరుగారు 1821 లో వర్ణించారు.