పుట:Kasiyatracharitr020670mbp.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిసి వుంచున్నది గనుక ఆవరణకు బహి: ప్రదేశములో జాతులవారు సిక్కులూరు అనే ప్రదేశములో ఇండ్లు తోటలు కట్టుకొని వసింపుచున్నారు. ఇక్కడ ఉండే అధికారస్థులు గౌనరు జనరల్ యేజెంటు అనే సర్వాధికారి ఒకడు, అప్పీల్ కోరటు జడ్జీలు ముగ్గురు, కష్టం కలకటరులు యిద్దరు, జడ్జీ ఒకడు, మేజస్ట్రేటు ఒకడు; వీరుగాక రెండుమూడు పటాలాలు ఇక్కడ వునికిగా ఉంచున్నవి గనుక వాటిలో చేరిన దొరలు ఒక జనరల్ సహితముగా వసింపు చున్నారు. లోగడును యీ పట్టణములో టంకసాల ఉండెను; ఇప్పుడు యెత్తివేశినారు. యీ దొరల కచ్చేరీలు అన్ని శిక్కులూరిలో ఉన్నవి.

యీపట్టణములో కొత్తవా లనే ఒక పెద్దఉద్యోగస్థుని కచ్చేరీ యున్నది. ప్రతి వీధికి ఠాణా లున్నవి. యిక్కడి వీధులకు గళ్ళీలని పేరు. ప్రతి గల్లీకి పాటక్కు అని తలుపులు ద్వారబంధనాలు పెట్టివున్నవి. ప్రతిపాటక్కునున్ను రాత్రి 10 ఘంటలకు బిగింపుచున్నారు. అవతల జనులు తిరుగులాడడము ప్రయాస. ఠాణా బంట్రౌతులు బరక్రదాసులనే పేళ్ళతో రాత్రిళ్ళు గస్తు తిరుగుతూ వున్నారు. వీరందరున్ను కొత్తవాల్ ఉత్తరువుకు లోబడి వున్నారు.

సమస్తమయిన కూరకాయలున్ను ఫలాలున్ను అపరిమితంగా దొరుకుచున్నవి. అందులో ఇక్కడి ముల్లంగిగడ్డల గాత్రమున్ను పొడుగున్ను నేను యీసరికి యెక్కడ చూచినవాణ్ని కాను. కూరగడ్డలని వేలెడులాఫు గల గడ్డలు వాటి ఆకు సహితముగా అమ్ముతూ వున్నారు. కిచ్చిలి మణీలా పండ్లు, కిచ్చిలి కమలాపండ్లున్ను చెట్లకింద రాలి యెత్తేవారు లేక నున్నవి.

గొప్పయిండ్లు పట్టపగలే చీకటిగా ఉంచున్నవి. ఘాటేయా లనే స్నానొపచర్యలు చేసేవారు అనేక జాతులుగా కలిసి యుంచున్నారు. అసివరణల మధ్యే 1200 మంది ఆయా స్నానఘట్టాలలో పలకలు వేసుకుని ఉపచర్యాద్రవ్యా లయిన విభూతి గోపీసందనము మొదలయినవి ఉంచుకొని యున్నారు. స్నానఘట్టములలో వారి యధికారము ఎక్కువ. యీ గంగా పుత్రులు ఘాటియాలు కాక ఠాణీలని పంఛ