పుట:Kasiyatracharitr020670mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

చెడు చేష్టలే విస్తారముగా చేస్తూ వచ్చినా వాటి నంతా ఆ శిశువు నటింఛే కొన్ని మంచి నడతలవల్ల మన్నించి బుజ్జగిస్తూ వచ్చిన్ని చెడు చేష్టలు యెక్కువయి తల్లి శిశువును దండించ తలచి దండించే రెండు మూడు తరుణాలలో తండ్రి విడిపించి యుండాగా మళ్ళిన్ని శిశువు చెడు చేష్ట మానక తల్లిచేత శిక్షింపబడుచు నుండగా తండ్రిని తలచి యేడ్చినట్టయితే యెట్లా తండ్రి మన కెక్కడి జోలి? యీ శిశువును కాపాడవలసిన భారము తల్లిదేను; మన మెంత సేపు ఈ శిశువును తల్లి దండనకు లోబడకుండా కాపాడగలము; తల్లి తెలియక దండించునా? ఇట్లా మనము దండనకు లోబడకుండా విడిపిస్తే శిశువు మరిన్ని మకురు బట్టిచేడిపోను; తల్లికి శిశువుకున్ను బంధ మెక్కువ; మనము తల్లికి యజమానుడయినా శిశువుకు సన్నిహిత బంధురాలు తల్లిగాని మనముగాము; యీ వుభయుల దు:ఖము ఎన్నడికిన్ని యిట్లా వుండేదేను; శిశువుకు బుద్ధి వచ్చేటందుకే తల్లిదండిస్తున్నది; మంచిపనే; యీ శిశువు ప్రతి దినమున్ను పెట్టే మొర జోలికి మనము పోరాదని యెట్లా తండ్రి విరామమును పొందుతాడో తద్వత్తుగా పరబ్రహ్మదుష్కర్మ ఫలానుభవమును చేయుచునుండే మనుష్యుడు నిండా పాపి అయి కొన్ని ఆ వృత్తులు తన కృపవల్ల ఆ యశుభఫలానుభవము తేలికె చేయబడిన్ని మళ్ళీన్ని దుష్కర్మ పరంపరనే చేసి వుండి తత్ఫలితానుభవాలు వచ్చినప్పుడంతా యీశ్వరభజన చేసి ఈశ్వరకటాక్ష సంపాదకము లయిన పనులుచేసినా మనుష్యునికి నుత్తరోత్తర శ్రేయస్సు నిమిత్తమై దుష్కర్మఫలమే అనుభవానికి వఛ్ఛేటట్టు అవుచున్నది. గనుక 'అవశ్యమనుభోక్తవ్య ' మనే వచనము సత్యమే, 'కోటయో పరబ్రహ్మహత్యానా మిత్యాద ' వచనాలున్ను సత్యములేగాని ఒకటికి ఒకటి విరుద్ధముగాదు.

చెన్నపట్టణములో నేను వుండగా కొందరు ఫరంగివాండ్లతో మతానుసారము లయిన మాటలు మాట్లాడుచు నుండగా యిదే రీతిగానే డిష్టయిని (Destiny) అనే విధి బలమయినప్పుడు ఈశ్వర కటాక్షమేమి పనికి వస్తున్నదని ప్రస్తాపము వచెను. అప్పుడు నాకు తోచిన బుద్ధిప్రకారము నేను సమర్ధించిన వయిన మేమంటె డిష్టయిని అనేవిధిని మదరాసు సూప్రీంకోర్టుగా భావించ వలసిన