పుట:Kasiyatracharitr020670mbp.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దనిన్ని యీశ్వరుని సీమరాజుగా భావించ వలసిన దనిన్ని; యెట్లా సీమరాజుయొక్క ఆజ్ఞవల్ల లోకులుచేసే తప్పుకు సూప్రీంకోర్టు వారు తూకు(ఉరి) తీయగలరో తద్వత్తుల్గా డిష్టయిని అనేవిధి కర్మఫలానుభవమునిచ్చినా సీమ రాజుతో రూపురూపుగా చెన్నపట్టణములోనుంచి యెవరికయినా జాబులు నడుస్తూ వుండేపాటి విహితముండి తనకు తూకున తీసేటట్టు సుప్రీం కోర్టువల్ల కలిగిన ఆజ్ఞకు సీమ రాజుమన్నన నిమిత్తమై వ్రాసి పంపించి తెప్పించుకో గలిగితే యెట్లా సుప్రీంకోర్టు యొక్క దండన తప్పిపోవచ్చునో, అట్లా డిష్టయిని అనేవిధి యీశ్వరకటాక్షము ముందర నిలవనేరదని చెప్పి సమాధానపెట్టినాను. ఈయుక్తులచేత శిశువు చేసిన తప్పుచేష్టలకు తగినదండన చేస్తూవుండే కోపముగల తల్లికన్నా దూరముగా నుండిన్ని శిశువుచేసిన చేష్టలనున్ను అందుకు తల్లిచేసే దండననున్ను చూస్తూవుండే తండ్రై నిండా దయాళువు గనుకనున్ను తల్లి శిశువుల కిద్దరికిన్ని తండ్రి స్వామిగనుకనున్ను తండ్రియెడలనే శిశువు నిండా భయభక్తులతొ నడుచుకొంటే అది యెట్లా క్షేమకరమో తద్వత్తుగానే మనుష్యులు కర్మములు చేసుటకన్నా భక్తిపారంగతులు కావడమే మంచిది. యీ న్యాయమును పట్టేవిశిష్టాద్వైతులు 'సర్వధర్మాస్పరిత్యజ్య ' అనేవాక్యాన్ని పాటించిన వారివలె అభినయిస్తారు. అయితే తల్లి తండ్రికన్నా ఎక్కువగా యెప్పుడున్ను శిశువుతొ కిందను మీదను పడుచున్న పోషిస్తు న్నుండేది గనుక మంచి పనులుచేసి మంచిమాటలాడి నప్పుడంతా అతి త్వరగా మనస్సు కరిగి శిశువును తన చేతనయినంత మట్టుకు ఉత్సాహపరచడమే కాకుండా తండ్రికి ఫలానికి మంచిపని శిశువు చేసినాడు, ఫలాని మంచిమాటను ఆడినాడని తెలియచేసి యెట్లా తండ్రియొక్క మన్ననకూడా శిశువుకు సంపాదించి యిసుస్తున్నదో, తద్వత్తుగా మనుష్యులు చేసే శుభకర్మాలు ఈశ్వరకటాక్షాన్ని కూడా సంపాదించి యిస్తున్నది, యెట్లా శిశువు పెద్దవాడయ్యేదాకా శిశువు తల్లి యొక్క అనుసరణ మన్ననలు అగత్యమో తద్వత్తుగా మనుష్యుడు జ్ఞానముచచ్చే పర్యంతము కర్మబద్ధుడయి మంచి కర్మలు చేస్తూ తద్ద్వారా యీశ్వరకటాక్షాన్ని సంపాదించుకొనుచు జ్ఞానము పుట్టిన