పుట:Kasiyatracharitr020670mbp.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

వారినంతా యీ సందేహమును నివృత్తి చేయవలసిన దని అడుగుచు వచ్చినంతలో వారు వారు యథోచితమయిన సమాధానాలు చెప్పుచు వచ్చిరిగాని, నిస్సందేహమును పొందచేసిన వారుకారు. అయితే పరబ్రహ్మమే గురువు గనుక పరబ్రహ్మ ప్రతిమానుష దేహములో ప్రతిఫలించేటట్టు నాదేహములోనున్ను ప్రతిఫలింపు చున్నాడు. గనుక నాయొక్క అంతర్యామిగా వుండే పరబ్రహ్మ యీ విషయములో నాకు ప్రత్యక్ష గురువయి, నాబుద్ది ద్వారా నాకు సందేహ నివృత్తి చేసిన క్రమ మేమంటే, క్రమమనిన్ని పరబ్రహ్మమనిన్ని రెండువస్తువులు శిశువును తల్లితండ్రులు పోషించేటట్టు అప్పటప్పటికి మనుష్యుణ్ని శిక్షించి రక్షింపు చున్నననిన్ని కర్మము సదా తల్లివలేనే శిశువు మంచి పనులుచేస్తే లాలించి చెడు పనులు చేస్తే శిక్షించినట్టు మహుష్యులు చేసిన శుభాశుభకర్మములకు తగ్గ ఫలమును సిద్దముగా క్రమము అనుభవింప చేయుచున్న దనిన్ని అయితే శిశువుకు తండ్రిగావుండేవాడు శిశువు చేసిన దుర్మార్గాన్ని గురించి తల్లి దండించి శిశుకు ఏడ్చేపాటి తాపత్రయము పుట్టినప్పుడు శిశువు తండ్రిని తలచి నాయనా అని పేరుపెట్టి తిల్లిచేసే శిక్ష తాళలేక నివృతిని పొందించమని యేడిస్తే యెట్లా తండై మంచిదిపో ఆ చేష్ట చేస్తే చేసినాడు; వాణ్ని కొట్టక తిట్టక వానికి పాలు నెయ్యి అన్నమున్ను పెట్టుము, ఇకను అట్లా చేయడని ఎట్లా తల్లి చేయతలచిన శిక్షను పూర్తిగాకుండా శిశువును విడిపిస్తాడో తద్ద్వత్తుగా మనుష్యులు దుష్కర్మము చేసినా దుష్కర్మ ఫలానుభవము వచ్చినపుడు ఈశ్వరుని గురించి భజనచేసి ఈశ్వరప్రీతి సంపాదకములయిన పనులు చేసి నట్తయితే తల్లిచేత శిక్షింపబడిచు నుండే శిశువును తండ్రి విడిపించినట్టు మనుష్యుని ధుష్కర్మ ఫలానుభవములో నుంచి యీశ్వరుడు సిద్ధముగా విడిపించగలడు. అయితే కొన్ని వేళలలో దుష్కర్మ ఫలానుభవము వచ్చినప్పుడు యెంత ఈశ్వరభజన చేసినా ఈశ్వరప్రీతి సంపాదకము లయిన జపహోమసురార్చనాదులు అనేకములు చేసినా దుష్కర్మ ఫలానుభల్వమే ఘటిస్తున్న దే అది యేమి? అని శంక తోచును. దానికి సమాధాన మేమంటే శిశువు