పుట:Kasiyatracharitr020670mbp.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగులవీరాస్వామయ్యగారి

కూడా వేసుకొనుచున్నారు. యీ సంగతి నాగపూరిలో తెలసి నందున నా దేహ సంబంధికులకు మాత్రము కాశివరకు చాలే పాటిగా నాతో కూడా వచ్చినవారు వక్కలు కొనితెచ్చినారు. యీదేశస్థులు హుక్కాతాగడము చేత పొగాకు సాథారణముగా దొరుకుచు వచ్చుచున్నది. తమల పాకులు జబ్బల్ పూరు మొదలు అతినల్పువర్ణముతొ బ్నిల్వపత్రివలెనే వుండేవి దొరుకుచున్నవి. మిక్కిలి ప్రయత్నము మీద అలాటి నల్లని వర్ణముగల తమల పాకులే పెద్దవిగా దొరుకు చున్నవి. హయిదరాబాదు మొదలుగా అమ్మేనెయ్యి మంచిది కాదు, గనుక నాగపూరు వరకు ఎన్నతీసి నెయ్యికాచుకుంటూ వచ్చినాము. పిమ్మట జబ్బల్ పూరు వరకున్ను అటు యివతలనున్ను వెన్న మజ్జిగె దొరకడము ప్రయాస అయినా నాకు యీ రాజ్యములో అక్క డక్కడ గొప్పవారిని శ్రీరాములు విహితము చేస్తూ వస్తాడు గనుక దొరికే తావులోనుంచి దొరకనితావుకు వెన్న మొదలయిన పదార్ధాలు నాకు ముట్టుచున్నవి.

ఆగామి సంచిత ప్ర్రారబ్ధ కర్మాలలొ మూటిలోనున్ను "అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మశుభాశుభమ్" అనేవచనము ప్ర్రారబ్ధకర్మ విషయమై సత్యమై వుండగా ఈశ్వరకటాక్ష మేమి చేయగలదు? మనము చేసినంత అనుభవించవలసిన దాయెనే అని సందేహపడి యీశ్వర భజన చేసి యీశ్వర ప్రియములయిన పనులు చేసినంతలో అది పయివాక్యాన్ని అనృతపరచ కుండానే ఆ ప్రారబ్ధకర్మఫలము దు:ఖమయిన పక్షమందు దు:ఖఫలమును పొందకుండా చేసి అభ్యుదయాన్ని నిస్సందేహముగా పొందింప చేస్తున్న దనేటందుకు సాధనములయిన వచనములు "కోటయో బ్రహ్మహర్యానా మగమ్యాగం కోటయ సద్య: ప్రళయ మాయాంతి మహాదేవేతి కీర్తనాత్" ఇది మొదలయినవి అనేకములున్నవి. యీ వచనములు సత్యములయితే అవశ్య మనుభోక్తవ్యం అనే వచనము అబద్ధము కావలసిన దాయెనే, యిందులో యేది సత్యము యేది అబద్ధము? లేక రెండున్ను సత్యములు కానేరవే; అనే తాత్పర్యము బహు దినములుగా నాకు కలిగి వుండి, నెను పెద్ధలని తోచిన