పుట:Kasiyatracharitr020670mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

చున్నది. ఆరెండు దోవలున్ను దగ్గిరైనా సడక్కు వేసివున్నందుననున్ను అన్నివిధాలా ప్రయాస నిఛ్ఛే మార్గములు గనుకనున్ను ఆరామడచుట్టయినా సడకువేసిన దారిగుండా మిరిజాపురానికి వెళ్ళేటట్టు నిశ్చయించినాను.

ఈ మైహరులొ 20 తేది మధ్యాహ్నము వరకువుండి మూడు ఘంటలకు బయలుదేరి 6 కోసుల దూరములోనున్న అమరాపాట్ర అనేవూరు రాత్రి 9 ఘంటలకు చేరినాను. నడిమివూళ్ళు; నెంబరు 14. బ్రహ్వ - 1 - అమరాపాట్ర - 1 దారి ముందరి మజిలీవలె సడక్కువేసియున్నా యెర్రగులకవేసి గట్టించి నందుననున్ను వర్షాకాలము గనుకనున్ను భూమి గౌరవర్ణపు రేగడ అయినందుననున్ను నడవను అనుకూలముగా నుండలేదు. మైహరు వూరికి కోసెడుదూరాన తమసానది దాటవలెను. అమరాపాట్ర వూరిముందర జింజిరీఅనే కాలవ యొకటి దాటవలెను. ఆ కాలువ వరకు మైహరు రాజ్యమునది. దానికి ఇవతల రీమారాజు రాజ్యము. అమరాపాట్రవూరు గొప్ప బస్తి అయినది. అంగళ్ళు విస్తరించి వున్నవి. అన్ని వస్తువులు దొరుకును. రీమారాజు తన తరఫున గొప్ప ముసాఫరుల సరఫరా నిమిత్తమై ఒక కొత్తవాలును వుంచియున్నాడు. మైహరునుంచి అమరాపాటనుకు వఛ్ఛేటప్పుడు మార్గములో కుడిచేతితట్టు మాత్రము కొంతదూరములో కొండ అగుపడుచు వచ్చుచున్నది. ఎడమ చేతిపక్క కొండలు అక్కడక్కడ తునిగి సంక్షేపబడుచు వచ్చుచున్నవి. వాటిలో రెండుకొండలు- ఒకటి ఫిరంగిగుండ్లు రాశిపోసి అతికిన చందముగానున్ను, ఒకటి ఒంటి కంభము డేరాచందముగా నున్ను వున్నవి. యీవూరిలో అంగళ్ళలొ యీ రాత్రి వసించినాను.

21 తేద ఉదయమయిన 6 ఘంటలకు లేచి యిక్కడికి 3 కోసుల దూరములోవుండే పల్నా అనేవూరు 8 ఘంటలకు చేరినాను. జబ్బల్ పూరు దాటిన వెనక కూడా కొందరు బోయీలు కావటివాండ్లు బంట్రౌతులున్ను అటు ముందు దాటివచ్చిన అడివిగాలి సంబంధమయిన చలిజ్వరాలతో పడ్డందున కొందరిని దోలీలలో వేసి కూడా తేవలసివచ్చినది; గనుక వారు వచ్చి కూడా కలుసుకొనే నిమిత్తమయి