పుట:Kasiyatracharitr020670mbp.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

పితృక్రియలు చేసినాను. నేటి దారి నల్ల రేగడయినా ప్రయాసకాదు, అడివి, రాతిగొట్టు, లేదు.

ఈ మబానది దాటిన వనక రంగిడి జాతి బ్రాంహ్మణులని ఒక సమూహమును చూచినాను. వీరికి గాయత్రీ జపము కలిగియున్నా వ్యస్థలేని నడితిని నడిచేవారు. ఈదేశపు కఠాడీ బ్రాంహ్యణులున్ను, చిత్వావనీబ్రాంహ్మణులున్ను వీరిని గర్హింపుచున్నారు. పిమ్మట వ్రాసిన రెండు తెగలవారితో మన దేశపు బ్ర్రాంహ్మణులు సాహచర్యము కలిగి సహపంక్తిగా భోజన మజ్జనాదులు గడుపుచున్నారు. చిత్పావనీవారు పునా శ్రీమంతుని జాతి. కరాడీవారు శక్తిపూజార్హులు. ఈ యిరుతెగలవారినిన్ని పరశురాముడు బ్రాంహ్మణుల యెడల జిహాస తోచి మశీదులలొవుండే శవాలను లేపి చిత్సావనీలను పుట్టించి కాష్టముల గుండా గడుపుకొన్నాడు. తెగకు 7 గోత్రాలవంతున వీరు 14 గోత్రాలవారు వీరిని కొంకణదేశస్థులని అనుచున్నారు.

నర్మదకు ఇవతలుగట్టు మొదలుగా విక్ర శకము ప్లవనామ సంవత్సరము బహుళ పాడ్యమి మొదలుగా పున్నమి వరకు మాసమనిన్ని వ్యహరింపుచున్నారు.

వింధ్య పర్వతమును కురాయి అనే వూరివద్ద ఆరోహణము చేసినట్టుగా లోగడ నేను వ్రాసినాను. అదే వింధపర్వతమునకి ఆరంభ మనిన్ని యీ భూమి యావత్తున్ను వింధ్యపర్వతము మీదిదే ననిన్ని చెప్పుతారు. రాయచౌడువద్దనున్ను పర్వతము మహాదేవ పర్వతమనిన్ని అచ్చట వరప్రసాదము చేయగల ప్రసిద్ధమయిన యొక శివస్థలము ఉన్నదనిన్ని చెప్పుతారు. యీ తిలవారాలో రెండుమూడు దేవాలయాలు చిన్నవయినా సుదరముగా కట్టియున్నవి. బ్రాంహ్మణ పూజ లేదు. గోసాయీల అధీనములో నున్నవి.

కురాయి అనే వూరు మొదలు నర్మదా నది పర్య్హంతము లోగడి కాలాలలో దారి నడిచి సురక్షితముగా చేరడము బహు దుర్లభము అందుకు దృష్టాంతముగా యిక్కడి దేశస్థులు సాహి