పుట:Kasiyatracharitr020670mbp.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

త్యాలుగా ఈమధ్యవుండే ఊళ్ళపేళ్ళ కని కొన్ని చేసినారు. వాటి తాత్పర్యము ఈ యూళ్ళు గడిచి నర్మద చేరితే తల్లికడుపులోనుంచి మళ్ళీ పుట్టినట్తు అనుకోవలె నని యున్నది. ఆ భయాలు యింగిలీషు దొరతనము వచ్చినవెనకలేదు. ఈవిషయములలో వీరి దొరతనము మేలని అనిపించుకొన్నా, యిక్కడి బ్రాంహ్మణులు నాగపూరు రాజు సాగరారాజు మొదలయినవారు బాగా వుండగా మేము రాజాన్న భోజనము చేస్తూ వస్తిమి; వారున్ను వారికింది అధికారస్థులున్ను పుష్కల మయిన జీవనాలు మాకు కలగచేసి యిచ్చుచు వచ్చిరి; ఇప్పుడు పస్తుగానున్నా మంటారు. దొంగతనముపోతే దొంగను పట్టి శిక్షించే వరకు సొమ్ముపోగొట్టుకొన్నవారున్ను, సాక్షులున్ను ఇల్లు వాకిళ్ళువదిలి భత్యము కట్తుకొని తిరిగి చస్తాము. తుదకును శిక్షబలము లేదు. కొంతకాలము గిడ్డంగిలో దొంగనుపెట్టి వదలురారు. వారు మళ్ళివచ్చి కన్నమువేచి దొంగిలింపుచున్నే ఉంటారు; దొంగిలించిన దానికి సాక్షి తెమ్మంటే యెక్కడనుంచి తెఛ్ఛేది? అని యీ విషయాలలో ఇంగిలీషు దొరతనము బహు హింసగా నున్నదని వ్యసనపడు కొంటారు. యీ దృష్టాంతము చూడగా ఒక మంచి వూహించి పనిచేయ బోతే ఒక చెడు ఆ మంచిలోనే ఉత్పత్తికావడము నిశ్చయమేనని తోచుచున్నది.

హయిదరాబాదు మొదలుకొని తియ్ని దొండకాయలు విస్తారముగా దొరుకుచున్నదవి. యీతిలవారాఘాటు లోపల వరకాయ లని ఒకదినము కాయలు చూచినాను. పచ్చిపోకకాయలవలెనే ఆకారముకలిగి దొండకాయలవలె గీతలు తీరియున్నది. వంటచేసి బోజనముచేస్తే పువ్వులు రాలని లేతవంగ పిందెల రుచితో సరిపోలియున్నవి. ఈకాయలు బహు ఆరోగ్యకరములనిన్ని రుచిగానున్న వనిన్ని రాజాధిరాజులు నలభై, యాభై ఆమడదాకా విందులకు గుర్రపుసవారీలను తాపాలుపెట్టి తెప్పించు కొంటారు గాని తమ స్థలములో వృద్ధి అయ్యే యోచన చేయడము లేదు. యీ కాయలకు బీజము గడ్డలు, వాటిలో మొలక మొలిచి తీగెలు అల్లి కాయలు కాచుచున్నవి. ఆవాల నూనె నాలు గయిదు మజిలీలుగా దీపపుచమురుకు దొరుకుచు వచ్చు