పుట:Kasiyatracharitr020670mbp.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.'ఏనుగుల వీరాస్వామయ్య గారి

తద్ద్వారా యిది పురషనది అనిపించి కొనుచున్నది. యీ మహానది మహిమ పురాణములో 12 వేల గ్రంధములచేత విస్తరించి చెప్పియున్నది. యిందులో పుట్టే శిలలంతా లింగాలుగా ఆరాధింపుచున్నారు. ఈ లింగాలు హిందూస్తాని మాటతో "అర్మదు కాకంకరునబు శంకరు" అంటారు. బెడాఘాటులో కృష్ణవర్ణపు లింగాలు పుట్టుచున్నది. ఆ స్థలము ఇమ్మడికి 4 కోసుల దూరము. ఓంకారంఘాటులో శ్వేతలింగాలుపుట్టుచున్నవి. ఆ స్థలము ఇక్కడికి 12 దినముల ప్రయాణము. ఈ తిలవారాస్థలములో ఒక దృష్టాంతము నాకండ్ల చూచినాను. అది యేమమంటే వేసిన అస్థులు సగము ముక్కాలువాసి శిలామయము లవుచున్నవి. గనుక క్రమముగా అంతా శిలామయము లవుచున్న వనడానకు సందేహములేదు. ఈ మహానది పశ్చిమవాహిని కావడముచేత అత్యాశ్చర్యముగా పది యిరువై తాటిచెట్ల పొడుగు గల కొండల నడమను భేదిచుకొని ప్రవహించుచున్నది. యీ వేదుక బెడాఘాటుకు పోతే చూడవచ్చును. ఈ మహానది ఇక్కడ నిండా వెడల్పు లేదు. 30 సంవత్సరముల కిందట రఘోజీబాబాతల్లి బహుస్తొమముతో కూడా యిక్కడికి యాత్రకు వచ్చి ముందర నర్మదానదిని పూజచేసి దాటనలసిన దని ఘాటువారు చెప్పగా మా నాగపూరి వద్ద ఖనానా అనే నదిపాటి వెడల్పు లేదే పూజ యేమని అలక్ష్యపెట్టినందుకు, నాటి సాయంకాలమే యివతలి గట్టుకు వచ్చి నదివోరగా దిగివుండగా గడియలో అమితముగా ప్రవాహము వచ్ఫి ఆమె సర్వస్వాన్ని హరించి మరుసటి గడియలో ప్రవాహము తీసిపోయి యధాస్థితికి వచ్చినది.

ఈ తిలవారా అనె ఊరిలో 12 ఇండ్లవారు కృష్ణాతీర మందలి యాంధ్ర బ్ర్రాంహ్మణులు, ఇండ్లు కట్టుకొని బహుకాలముగా ఈ దేశపు బ్రాంహ్మణులతే సంబంధ బంధుత్వములు చేయకుండా అధ్యయనము చేయుచు పాఠము చెప్పుకొనుచున్నారు. రామటెంకి వదిలిన వనక ఈ యూరివరకు బ్ర్రాంహ్మణ దర్శనమే అయినది కాదు. ఈయూరిలొ వసతి అయిన కొట్టాయి కట్టియున్నారు. నేను బ్ర్రాంహ్మణ యింట్లో నే దిగినారు. సకల పదార్ధాలు దొరుకును. ఇక్కడ క్షౌరము మొదలైన