పుట:Kasiyatracharitr020670mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

నేను ఊహించిన కారణ మేమంటే సమానులలో ఉత్తమ కీర్తిగలవారు కావలెననే శ్రుతివాక్యర్ధ ప్రకారము ప్రతి పురుషునికిన్ని సమానులలో ఉత్తము డనిపించుకో వలెననే ఆసక్తి సకల విధాలా వుండును గనుక యీ బోయీలు ఒక జతగా కలిసి నప్పుడు మంచి మోతేగాడయితే వారిలో ఉత్తమకీర్తి జనింపుచున్నది, గనుక ఒకరు యీప్రయాసలకు ఓర్చనేరక వెనకబడ్డా, మోతలో జబ్బుపడ్డా జతలో నుండే యితరులు అప్పుడేచాలాగా వెనకబడ్డ వానిని నిందింపుచున్నారు. గనుక సమానులవద్ద విందింపబడే దాని కన్నా దేహము పపోవడము మేలని తోచి యిటువంటి ప్రయాసను ఓర్చి సమానులచేత స్తుతింపబడక పోయినా, నింద యయినా లేక నుండవలెననే తాత్పర్యముతో ఈ కష్టములను ఓర్చి యీబోయీలు మోత సాగింపుచున్నా రని నిశ్చయించినాను. యీకొద్ది పరువు కల మనుష్యులెకే సమానులలో యోగ్యుడనిపించుకోవలెననే అక్కడ యింత ఉండగా తదపేక్షయా ఉత్తములకు పరంపరగా ఎంత ఉండవలసినది? యిది యోచించి సమానులను నిష్కారణముగా అవమానపరచి నంతలో ప్రమాదము వచ్చుననిన్ని సమానులను ఆదరించి గౌరవము చేస్తేగాని తాను ఉత్తమశ్లోకుడు కానెరడనిన్ని, తెలిసి ప్రపంచములో ప్రవర్తింపుచు రావలసినది. యీ యూరిలో యీ రాత్రి వసించినాను.

5 తేది ఉదయాన 5.4 ఘంటకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో నుండే పిప్పర అనే ఊరు 12 ఘంటలకు చేరినాను. (మధ్యనున్న ఊళ్ళు)

నెం.8 జంజూరికే భావనా - 1 - చెన్రూ - 1 - రొతినాలా-1 దారి రాతిగొట్టు, నల్లరేగడ సాతుగడ అనే7 కొండలు ఎక్కి దిగవలసినది. మోతినాలా అనేవాగు మధ్యే ఉన్నది. ఆ వాగు ఇవతల యేడుకొండలు యెక్కి దిగేవరకు కొంత అడివి కలిగి యుంచున్నది. కురాయి అనే యూరు మొదలుగా లొగడ యింగిలీషు వారికి నాగపూరు రాజు యిలాకా దారులతో అనేకవృత్తులు యుద్ధ ప్రసక్తులు కలిగినది. గనుక అప్పట్లో విస్తారముగా అడివికొట్టి భాట వెడల్పుచేసి చక్కపెట్టినారు. అది యిప్పట్లో లొకోపకారముగా నున్నది. యీ