పుట:Kashi-Majili-Kathalu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కాదంబరి


చితిని? అతం డదృష్టపూర్వుండు. కనబడఁగూడదని యించుకయు శంకింపనైతి. నన్ను లోకులు లఘుహృదయంగాఁ దలంతు రని నిర్లజ్జనై యాకలింప నైతిని. గురుజనములకు వెరవక లోకాపవాదమునకు భయపడక మహాశ్వేత దుఃఖితయైయున్న దనుమాట యాలోచింపక పరిజనము జూచునని తెలియక సష్టచేతననై దుష్టమగు పని కావించితిని నాప్రమాదము స్థూలబద్ధులుగూడఁ జులకనగాఁ దెలిసికొనఁ జాలుదురనిన ననుభూతకందర్పవృత్తాంతయగు మహాశ్వేతయు సకల కులాకుశలలగు సఖురాండ్రును రాజకులసంచారచతురలగు పరిజనులును, గ్రహించుట యేమియబ్బురము? అంతఃపుర దాసు లిటువంటిపనులఁ దెలిసికొన నతినిపుణదృష్టిగలవారుగదా?

అన్నివిధముల నే నిప్పుడు భ్రష్టురాలనైతిని. నాకిప్పుడు మరణమే శ్రేయము. బ్రతుకుట లజ్జాకరము. ఈవృత్తాంతము విని నా తల్లిదండ్రు లేమందురో! ఏమిజేయుదును? ఇందులకుఁ బ్రతీకార మేది? ఏయుపాయమున నీస్ఖలితమును గప్పికొందును. నాయింద్రియచాపల్య మెవ్వరితోఁ జెప్పికొందును.

అయ్యయ్యో! నాసఖుల ముందరఁ బెండ్లియాడనని శపధముఁ జేసియావత౯ కేయూరక ముఖముగా మహాశ్వేతకుఁ దెలియజేసితినే? ఆమాట యించుకయు జ్ఞాపకము లేకపోయినది. శఠవిథి యా చంద్రాపీడు నాకడ మేమిటికిఁ దీసికొనిరావలయును? అతఁ డెవ్వఁడు? ఎప్పుడైన జూచితినా? వింటినా? తలంచితినా?


వానిం జూచినంతనే నాయింద్రియము లన్నియు విత్తమిచ్చికొనఁబడినట్లు తద్వశములై పోయినవే? తెలిసికొంటి. నాచపలునితో నాకేమియుం బనిలేదు. అని క్షణకాలము ధ్యానించి యంతలో మన్మథునిచేతఁ బాణములతోఁగూడ నీధైర్యావలేప మపనయించెదఁ జూడుమ భయపెట్టఁబడినదివోలెఁ గ్రమ్మరఁ దనహృదయమ్ముఁ