పుట:Kashi-Majili-Kathalu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

87


ఆయుష్మతీ! మహాశ్వేతా! చిత్రరధుండును భార్య మదిరా మహాదేవియు నీరాక విని మిగుల నానందించుచున్నారు. నీతో ముచ్చటించుటకుఁ దొందరపడుచు వేగఁ దీసికొని రమ్మనిరని పలికినది.

అప్పుడు మహాశ్వేత కాదంబరీ! నేను నీ తలిదండ్రులఁ జూడఁ బోవుచున్నాను. నేను వచ్చుదనక నీతం డెందుండవలయు నని యడిగిన నప్పుడంతి స్త్రీలహృదయస్థానములయందని మనసున ననుకొని ప్రకాశముగా నిట్లనియె. సఖీ! నీవు నన్నిట్లడిగెదవేల? చూచినది మొదలు శరీరమునకు, భవనమునకు విభవమునకు నీతండే పరివృఢుండని తలంచుచుంటి ప్రియసఖీ! హృదయమునకుఁ గాని యాయనకుఁ గాని యెందిష్టమో యందే యుండవచ్చునని చెప్పిన మహాశ్వేత యిట్లనియె.

సఖీ! అట్లయిన నీమేడ సమీపమందున్న ప్రమద వనమునందలి క్రీడాపర్వతమునఁ గట్టఁబడిన మణివేశ్మమందు నివసింపఁజేయుమని యుపదేశించి మహాశ్వేత గంధర్వసార్వభౌముం జూడఁబోయినది.

చంద్రాపీడుండును మహాశ్వేతతోడనే బయలుదేరి వీణావాదినులు వేణువాద్యనిపుణులు సంగీత విద్యాపారంగతలగు గంధర్వకన్యకలు పెక్కండ్రు కాదంబరీ సమాదిష్టలై తన్ననుసరించి రాఁ బూర్వ పరిచితుండగు కేయూరకుండు ముందు నడుచుచు మాగ౯ము జూపుచుండ ఱెండవజయంతమువలె నొప్పుచున్న యమ్మణి మందిరమున కరిగెను.

పిమ్మటఁ గాదంబరియుఁ బరిజనములెల్ల విడిచి యొక్కరితయే మేడ యెక్కి తల్పంబునం బండుకొని యాత్మీయంబులగు వినయ ముగ్ధతా కుమారభావ కులమర్యాదాది విశేషంబులం దలంచుకొని యగ్గలంబగు సిగ్గు జెందుచు నిట్లు విచారించినది.

అయ్యో! మోహాంథురాలనై యిప్పుడు నే నెట్టి పని గావిం