పుట:Kashi-Majili-Kathalu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాదంబరి

చేసితిని? అయ్యో, నీవు నాకతంబున నెట్టియవస్థబొందితివి. నాకీ బ్రహ్మహత్యా పాతకంబెట్లు పోవును. నేను మహాపాతకురాలను. ఇట్టి నిన్ను విడిచి ఇంటికిఁ బోయితిని. ఇఁకనాకు దల్లిదండ్రులతోఁ బ్రయోజనమేమి? బంధువులేమిటికి? దైవమా, నన్ననుగ్రహింపము; వనదేవతలారా, అనాధను రక్షింపరా? తల్లీఁ! భూవి! లోకానుగ్రహకారిణి! నా యందు నీకైనం దయలేదా? యని యనేకప్రకారముల నేమియుందెలియక గ్రహావిష్ణురాలి చందమునఁ బ్రేలుచు విలసింపఁ దొడంగితిని; మఱియుఁ దచ్ఛరీరంబునంబడి కపోలములు ముట్టుచు జటాకలాపములు సవరించుచు హృదయంబున నిడిన నళినీదళంబులఁ దీసివేయుచు మాటిమాటికి మోముచుంబించుచు సారెసారెకు గంఠ గ్రహణముచేయుచు, ఆర్యా, యీతనిం బ్రతికింపుమని కపింజలుని పాదంబులంబడుచు, దరళికం గౌఁగలించుకొనుచుఁ బెక్కుగతుల విలపించితిని.

అప్పుడు నానోటనుండి అశ్రుతపూర్వములు ననుపదిష్టములు నగుచాటూక్తులెన్నియేని వెడలినవి. తలంచుకొన నాకావిలాపవచనము లెట్లు వచ్చినవో నాకే చిత్రమగుచున్నది. అదియొక యనస్థ గదా. జలయంత్రమువలె నశ్రుప్రవాహములు బయలు వెడలుచుండెను. నోటినుండి యంకురించుచున్నట్ల ప్రలాపములు వచ్చుచుండెను. అన్నన్నా, ఆయవస్థ తలంచుకొనినంత మేను గంపము నొందుచున్న దని పలుకుచున్న యామహాశ్వేత చేతనమును మూర్ఛ హరించినది.

తద్వేగంబునం బడుచున్న యామెను జంద్రాపీడుఁడు కరంబులనాని పట్టుకొని యశ్రుజలములచేతఁ దడసిన తదుత్తరీయముచేతనే మెల్లగా వీచుచుఁ గొంతసేపునకుఁ దెలివివచ్చి కన్నులు దెరచిన యామెఁజూచి దైన్యంబుదోప నిట్లనియె.

భగవతి! నాకతంబున నీకీశోకము వెండియు దాపము గలుగఁ