పుట:Kashi-Majili-Kathalu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాదంబరి

అట్టిసమయమునఁ గానన కుసుమవాసనలం బరిభవింపుచు ననాఘ్రాతపూర్వమగు పరిమళమొండు వనానిలానేతమై నాకు నాసాపర్వము గావించినది.

ఓహో! అమానుషలోకోచితమగు నీసౌరభము నా కెట్లు కొట్టినది? యని వెరగందచు గన్నులు మూసికొని యాసుగంధ మాఘ్రాణించి యాఘ్రాణించి శిరఃకంపముచేయుచుఁ దదుత్పత్తిస్థాన మరయుతలంపుతో లేచి నూపుర రవఝుంకారమునకు నరఃకలహంసల ననుసరించి రాఁగా గొన్నియడుగులు నడిచి నలు మూలలు పరికించి చూచితిని.

అప్పుడొకవంక నఖిలమండలాధిపత్యమును గైకొన ధృతవ్రతుండయిన శశాంకుండోయనఁ ద్రిలోచనుని వశముఁజేసికొనఁ దపం బొనరించుచున్న కుసుమశరుని పగిది మనోహరాకారముతో నొప్పుచు మందారవల్కలములుదాల్చి హస్తంబున దండకమండలములు మెరయ ఫాలంబున విభూతిరేఖయు కటీతటి మౌంజీమాలికయు గరంబున స్ఫటికాక్షమాలికయుం ధరించి మూతీ౯భవించిన బ్రహ్మచర్యము భాతి బుంజీభవించిన శ్రుతి కలాపమట్లదీపించుచు దేహ కాంతులచేఁ బ్రాంతభూజముల బంగారుమయములుగాఁ జేయుచు సవయస్కుఁడగు మునికుమారుతోఁగూడ స్నానాథ౯మై యరుదెంచిన దాపసకుమారుం డొకండు నాకన్నులకుఁ బండువ గావించెను. అతనిచెవియందుఁ గృత్తికానక్షత్రమునుం బోలిన యదృష్టపూర్వమగు పుష్పమంజరి యొండు అమృతబిందువుల శ్రవించుచు విరాజిల్లుచున్నది. దానిం జూచినేను ఓహో! మదీయఘ్రాణమునుఁ దృప్తిపరచిన సౌరభ మీ గుచ్ఛంబునఁబుట్టినదే యని నిశ్చయించుచు వెండియు నత్తపోధన కుమారు నీక్షించి మనంబున నిట్లు వితర్కించితిని

అయ్యారే! చతుర్ముఖుని రూపాతిశయ వస్తునిర్మాణకౌశల