పుట:Kashi-Majili-Kathalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిన్నెరమిధునముకథ

39

అన్నన్నా? పిన్నవాఁడువలె నేనీకిన్నర మిధునము వెంటవచ్చి యూరక శ్రమపడితిని. దొరికినను దొరకకున్నను దీనితో నా కేమి ప్రయోజనమున్నది. బాపురే? నిరర్థకవ్యాపారమున నాకింత యాసక్తి యేలపుట్టవలయును? చేసినకార్యము లేమైనం దీనజెడిపోవుచున్నవా? లేక మిత్రులకుఁ జేసినయుపకృతి నిలుపఁబడుచున్నదా? అయ్యారే! విచారింప దీనివెంటనేనింతదూరమెందులకు వచ్చితినో తెలియకున్నది. తలంచుకొన నాకే నవ్వువచ్చుచున్నది. అయ్యయ్యో, ఇచ్చటికి నాబలమెంత దూరములోనున్నదియో తెలియదు. నాతురగము నిమిషములోఁ బెక్కుదూరము నడువనోపును. నేను గిన్నర మిధునమంద దృష్టియిడి యతివేగముగా వచ్చుటచేనిప్పుడు తిరుగా నేదారినిఁ బోవలయునో తెలియకున్నది. ఈయరణ్యములోఁ బ్రయత్నముతోఁ వెదకినను దారినెఱిగించు మనుష్యుఁ డెవ్వడు గనంబడకున్నాఁడు. యిది దేవభూమివలె దోచుచున్నది. ఇందు మనుష్యసంచార ముండదు. ఇది యుత్తరదేశముగావున నేను దక్షిణముగా బోయిచూచెదను. తానుజేసిన కర్మలయొక్క ఫలము తానేయనుభవింప వలయునుగదా? అని యూహింపుచు మెల్లగాఁ దురగమును దక్షిణదిశకు మరలించెను.

అట్లు మరలించి అయ్యో, యిప్పుడు సూర్యుఁడంబరతలమధ్యవతి౯యై యున్నవాఁడు. ఈఘోటకమును మిక్కిలి యలసినది. యిది కొంచెము మేసినతరువాత నీరుద్రావించి నేనును నీరుద్రాగి యలసట దీర్చుకొని ముహూత౯ కాలము విశ్రమించి పిమ్మటఁబోయెదను.

అనినిశ్చయించి నీరుండు తావరయుచుండ నొకదండ జలపక్షు లెగురటయుం గనిపెట్టి యమ్మాగ౯ంబున బోఁవబోవ మనోహర తరుషండ మండితమగు నచ్చోదమను సరోవరమొండు గనంబడినది. చూచినంతమాత్రమున మాగా౯యానమంతయు నపనయింపఁజేసిన యక్కాసారంపు శోభంజూచి యతండాత్మగతంబున నిట్లుతలంచెను.