పుట:Kashi-Majili-Kathalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీమజిలీ కథలు


ఉత్తరఖండానుబంధము. 31 వ మజిలీ.


కాదంబరి.


శూద్రకమహారాజుకథ.

గీ. పుడమిఁగలిభయమునఁ బ్రోగుపడిన కృత యు
    గంబనఁగ సర్వధర్మ ప్రకాశమగుచు
    సారవేత్రవతీనదీతీరమందు
    విదిశయను రాజధాని సంపదలఁబొదలు.

అప్పట్టణంబున కధినాయకుండై శూద్రకుండను రాజు సకల నృపశిరస్సంధానితశాసనుండై ఱెండవ పాకశాసనుండువోలె భూమండలమంతయు నేకాతపత్రముగఁ బాలించుచుండెను.

అన్నరవరుం డనవరతదానజలార్ద్రీకృతకరుండై దిగ్గజంబువోలెఁ బ్రతిదివసోపజాయమానోదయుండై ప్రభాకరుని చందమున నొప్పుచు సర్వశాస్త్రములకు దర్పణమనియుఁ గళల కుత్పత్తిస్థానమనియు సుగుణములకుఁ గులభవనమనియు మిత్రమండలమున కుదయశైలమనియు రసికులకాశ్రయుఁడనియు ధనుర్ధరులకుఁ బ్రత్యాదేశమనియుఁ బొగడ్త కెక్కెను.