పుట:Jyothishya shastramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుణ్యములు రెండూ చేరుచున్నవి. కర్మచక్రము లేక కర్మపత్రమునందు పాపమూ, పుణ్యమూ మరియు పాపపుణ్యములు రెండూవున్న స్థానములను క్రింద 41వ చిత్రపటములో చూడవచ్చును.

41వ చిత్రపటము

కర్మచక్రములో ఇంతవరకు కోణములు కేంద్రములను గుర్తించడమే కాకుండా వాటియందునూ, మిగతా స్థానములందునూ పాపపుణ్య స్థానములను కూడా గుర్తించుకొన్నాము. ఇప్పుడు కర్మపత్రములో ఎక్కడ ఏ కర్మ వ్రాయబడుతుందో, మనిషి తన ప్రారబ్ధమును ఏయే స్థానమునుండి అనుభవించుచున్నాడో తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము. కర్మచక్రము లేక కర్మపత్రము యొక్క స్థానమునూ, దాని కదలికనూ, దాని అమరికనూ తెలుసుకొన్నాము. తెలిసిన దానినిబట్టి పైనగల కాలచక్రములోనున్న ద్వాదశ గ్రహముల కిరణములు క్రిందగల కర్మచక్రములోని పాపపుణ్య కర్మలమీద ప్రసరించగా, ఆ కిరణములు కర్మచక్రములోని కర్మను తీసుకొని క్రింద గుణచక్రములోనున్న జీవుని మీదపడును. అక్కడ జీవునిమీద గ్రహ