పుట:Jyothishya shastramu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైన కనబరచిన పుణ్య, పాప స్థానముల కోణములను గమనించితే 1×7 పూర్తి స్థాయి శత్రువు అను సూత్రమును అనుసరించి పుణ్యకోణము లకు పూర్తి ఏడవ స్థానములే పాప కోణములుగాయున్నవి. ఒకటికి ఏడు (1×7), ఐదుకు పదకొండు (5×11), తొమ్మిదికి మూడు (9×3) పూర్తి వ్యతిరేఖ కోణములుగా ఉన్నవి. వీటినిబట్టి కర్మపత్రములో ఆయా స్థానముల యందు మనిషియొక్క పాపపుణ్యములు చేరుచున్నవి. దీనినిబట్టి ఏ విధముగా చూచినా కోణములు 1,5,9 ఒక రకము అనియూ, 3,7,11 మరొకరకము అనియూ చెప్పవచ్చును. అట్లే కేంద్రము 4వ స్థానము ఒకటికాగా, రెండవది 10 స్థానముగా ఉన్నది. కర్మపత్రములోనున్న పన్నెండు స్థానములయందు మూడు స్థానములలో పుణ్యము లిఖించబడగా, మూడు స్థానములలో పాపము లిఖించబడినది. మిగత ఆరుస్థానములలో పాపము మరియు పుణ్యము రెండూ లిఖించబడ్డాయి. మూడు స్థానములు పుణ్యము, మూడు స్థానములు పాపము, ఆరు స్థానములు పాపపుణ్యములు మొత్తము పన్నెండు స్థానములలో ప్రారబ్ధకర్మ వ్రాయబడియుండును. వెనుకటి జన్మలలో సంపాదించుకొన్న ఆగామికర్మ ప్రస్తుత జన్మలో ప్రారబ్ధముగా మారి, ఆ ప్రారబ్ధము ప్రస్తుత జన్మలో అనుభవమునకు వచ్చుచున్నది. 69 సంవత్సరముల 5 నెలల 10 దినములు సంపాదించబడిన ఆగామికర్మ ఒకమారు సంచితముగా మారిపోవును. ఆ సంచిత కర్మనుండి ప్రారబ్ధ కర్మ మరణములో ఏర్పడి జరుగబోవు జన్మకు కారణమగుచున్నది.

మరణము పొందిన మరుక్షణమే కర్మపత్రములో రహస్యముగా యున్న సంచితకర్మనుండి ప్రారబ్ధకర్మ తయారై కర్మచక్రములో 1,5,9 స్థానములయందు పుణ్యము చేరిపోగా, పాపము 3,7,11 స్థానములలో చేరిపోవుచున్నది. మిగత సరిసంఖ్య అయిన ఆరు స్థానములలో పాప