పుట:Jyothishya shastramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జవాబు ఏమనగా! బయట దేనిని తెలుసుకొనినా దానిని తెలుసుకోవడము, గ్రహించడము అనియే అనుచుందుము. కానీ ‘ఇష్యము’ అను పదము ఎక్కడా వాడడము లేదనుట నేను కూడా ఒప్పుకొందును. ఒక్క శరీరములోని కర్మను తెలుసుకొనునపుడు మాత్రము ‘ఇష్యము’ అను పదమును ఉపయోగించెడివారు. ‘ఇష్యము’ అను పదము లేక శబ్దమును ఒక పాప పుణ్యములను తెలుసుకొనునపుడు మాత్రము ఉపయోగించుట వలన, ఆ పదము ప్రత్యేకమైనది. అలాగే ‘జ్యోతి’ అను పదమునకు ఇక్కడ దీపము అని అర్థము చేసుకోకూడదు. ‘జ్యోతి’ అంటే జ్ఞానము అని భావించవలెను. ఇది ఒక్క ఆధ్యాత్మికములోనే ‘జ్యోతిని’ జ్ఞానము అని అంటున్నాము. ఆత్మ జ్ఞానముగల మనిషి తన జ్ఞానముతో ఎదుటి మనిషి శరీరములోని కర్మను తెలుసుకొని, వానికి తెలుపడమును ‘జ్యోతిష్యము’ అంటాము. ఇక్కడ జ్యోతిష్యము అంటే దీపముతో వస్తువును తెలుసుకొనేది కాదు, జ్ఞానముతో కర్మను తెలుసుకోవడమని అర్థము. ఇపుడు జ్యోతిష్యము అంటే దైవజ్ఞానము కల్గిన వ్యక్తి, ఒక మనిషి కర్మలోని పాపపుణ్యములను తెలుసుకొని పాప ఫలితమునూ, పుణ్యఫలితమునూ వివరించి చెప్పడము అని పూర్తిగ అర్థమగుచున్నది. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! శరీరాంతర్గత కర్మ ఫలితమును చెప్పు దానిని ‘జ్యోతిష్యము’ అనవచ్చును. కానీ బయటి ప్రపంచ వస్తువులను గురించి చెప్పునది జ్యోతిష్యము కాదు. ఉదాహరణకు జరుగబోవు ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందనడముగానీ, లేక నేను దాచిపెట్టిన వస్తువేది అని అడగడముగానీ, మూసిన బోనులోని జంతువేది అని అడగడముగానీ, నా ప్యాకెట్లోని వస్తువు ఏదో చెప్పు అని అడగడముకానీ, జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నలు కాదు. దానికి సమాధానము చెప్పడము జ్యోతిష్యము కాదు. ఎందుకనగా! ఇటువంటి